పిఎంఇండియా
బీహార్‌లోని నలంద జిల్లాలో జరిగిన తొక్కిసలాటలో సంభవించిన ప్రాణనష్టంపై ప్రధానమంత్రి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ విషాద ఘటనలో తమ ఆత్మీయులను కోల్పోయిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ.. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రధానమంత్రి ప్రార్థించారు.
మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (పీఎంఎన్‌ఆర్‌ఎఫ్) నుంచి ఒక్కో మృతుని కుటుంబానికి రూ. 2 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ. 50,000 చొప్పున ఆర్థిక సహాయాన్ని ప్రధానమంత్రి ప్రకటించారు.
సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ప్రధానమంత్రి ఈ విధంగా పేర్కొన్నారు.
‘‘బీహార్‌లోని నలంద జిల్లాలో జరిగిన దుర్ఘటన తీవ్రంగా కలిచి వేసింది. ఈ ప్రమాదంలో తమ ఆత్మీయులను కోల్పోయిన వారికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను.
పీఎంఎన్‌ఆర్‌ఎఫ్ నుంచి ఒక్కో మృతుని కుటుంబానికి రూ. 2 లక్షల చొప్పున నష్టపరిహారం అందజేస్తున్నాం. గాయపడిన వారికి రూ. 50,000 ఇస్తున్నాం: ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ’’.
The mishap in Nalanda district, Bihar, is deeply painful. I extend my condolences to those who have lost their loved ones. Prayers for the speedy recovery of those injured.
— PMO India (@PMOIndia) March 31, 2026
An ex-gratia of Rs. 2 lakh from PMNRF would be given to the next of kin of each deceased. The injured…