పిఎంఇండియా
విద్య కేవలం జీవనోపాధి కోసం మాత్రమే కాదని, జీవితాన్ని మరింత మెరుగుపరుచుకోవడానికి ఒక శక్తిమంతమైన సాధనమని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు. విద్యను వెలకట్టలేని సంపదగా అభివర్ణించారు. దీని ద్వారానే దేశ యువత ప్రతి రంగంలోనూ కొత్త శిఖరాలను అధిగమిస్తూ.. దేశానికి ఎనలేని కీర్తిని తీసుకొస్తున్నారని అన్నారు.
ప్రధానమంత్రి ఒక సంస్కృత సుభాషితాన్ని పంచుకున్నారు.
‘‘శ్రియః ప్రదుగ్ధే విపదో రుణద్ధి
యశాంసి సూతే మలినం ప్రమార్ట్ష్రి।
సంస్కారశౌచేన్ పరం పునీతే
శుద్ధా హి బుద్ధిః కిల కామధేనుః॥’’
విద్యావంతమైన, సంస్కారవంతమైన, పవిత్రమైన బుద్ధి… జీవితంలోని కష్టాలను తొలగించి విజయాన్ని, గౌరవాన్ని, శాంతిని, ప్రగతిని ప్రసాదిస్తుందని ఈ సుభాషితం తెలియజేస్తుంది. నిజానికి జ్ఞానోదయమైన మనసు కామధేనువు వంటిది. ఇది మనిషికున్న అన్ని రకాల ఆశయాలను నెరవేర్చగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ఈ విధంగా పేర్కొన్నారు.
‘‘విద్య అనేది కేవలం జీవనోపాధికి మార్గం మాత్రమే కాదు.. జీవితాలను ఉన్నతంగా తీర్చిదిద్దే శక్తిమంతమైన సాధనం కూడా. ఇది ఒక అమూల్యమైన సంపద. దీని ద్వారా మన యువత ప్రతి రంగంలోనూ కొత్త రికార్డులు సృష్టిస్తూ దేశానికి కీర్తిని తెస్తున్నారు.
శ్రియః ప్రదుగ్ధే విపదో రుణద్ధి
యశాంసి సూతే మలినం ప్రమార్ష్టి।
సంస్కారశౌచేన్ పరం పునీతే
శుద్ధా హి బుద్ధిః కిల కామధేనుః॥’’
शिक्षा केवल आजीविका का साधन नहीं, बल्कि जीवन को श्रेष्ठ बनाने का सशक्त माध्यम भी है। यह वो अनमोल पूंजी है, जिसके जरिए आज हमारी युवाशक्ति हर क्षेत्र में नए-नए कीर्तिमान बनाकर देश का नाम रोशन कर रही है।
— Narendra Modi (@narendramodi) April 3, 2026
श्रियः प्रदुग्धे विपदो रुणद्धि
यशांसि सूते मलिनं प्रमार्ष्टि।
संस्कारशौचेन… pic.twitter.com/W6rlpcbQ2n