Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

మనిషి లోలోపలి జ్ఞానానికి ఉన్న ప్రాధాన్యాన్ని చాటి చెప్పే సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి


మనిషి లోలోపలి జ్ఞానానికి ఉన్న ప్రాధాన్యాన్ని వివరించే, ఈ విశ్వంలో నిజమైన సారం అదేనని చాటి చెప్పే ఓ సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు పంచుకున్నారు.

నిజమైన జ్ఞానం, దానిని సరైన విధంగా ఉపయోగించడం.. ఇవే ఏ దేశ ప్రగతికైనా మూలాధారమని భారతీయ సంస్కృతీ వారసత్వాలు మనకు బోధిస్తున్నాయని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ఈ బాటలో నడుస్తూ, దేశ యువతీయువకులు సమృద్ధ, సాధికార భారత్‌ను ఆవిష్కరించేందుకు చురుకుగా పని చేస్తున్నారని శ్రీ మోదీ తెలిపారు. ఈ జ్ఞానం మన అందరిలోనూ వెలిసిందనీ, ఇది సామాన్య జ్ఞానాని కన్నా మించిన జ్ఞానమనీ, మహనీయులతో పాటు వివేకవంతులు ఆరాధించేది ఈ జ్ఞానాన్నేననీ ఆయన వివరించారు.

 

 

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఒక సందేశాన్ని పొందుపరుస్తూ,

‘‘నిజమైన జ్ఞానం, ఆ జ్ఞానాన్ని సద్వినియోగపరచడం.. ఇవి దేశ ప్రగతికి మూలాధారమని మన సంస్కృతి, మన వారసత్వం మనకు బోధిస్తున్నాయి. ఈ మార్గంలో ముందుకు సాగుతూ ఇవాళ మన దేశ యువతీయువకులు సమృద్ధ, సశక్త భారతాన్ని ఆవిష్కరించే కృషిలో నిమగ్నమయ్యారు.

అన్త:స్థమేవ యజ్ఞానం జ్ఞానాదపి చ యత్పరమ్

తదేవ సర్వసంసారసారం సద్భిరూపాస్యతే

మన లోపల కొలువై ఉన్న జ్ఞానం సామాన్య జ్ఞానం లేదా వెలుపలి జ్ఞానం కన్నా శ్రేష్ఠమైంది. అదే ఈ సమస్త విశ్వంలోని అసలైన సారం. మహానుభావులు, వివేకవంతులు ఈ ఆంతరంగిక జ్ఞానాన్నే ఉపాసిస్తుంటారు’’ అని పేర్కొన్నారు.

***