పిఎంఇండియా
మాజీ ప్రధానమంత్రి శ్రీ చంద్రశేఖర్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు.
శ్రీ చంద్రశేఖర్ శతజయంతి ప్రారంభాన్ని ఈ ఏడాది సూచిస్తుందని ప్రధానమంత్రి అన్నారు. ఇది సుసంపన్నమైన, నిష్పక్షపాతమైన భారత్‌ను సాధించాలనే ఆయన ఆశయాన్ని నెరవేర్చడంలో చిత్తశుద్ధిని పునరుద్ఘాటించాల్సిన సందర్భమని తెలిపారు.
ధైర్యం, దృఢ సంకల్పం, ప్రజాస్వామ్య విలువల పట్ల నిబద్ధత కలిగిన ప్రజా నాయకుడిగా మాజీ ప్రధాని శ్రీ చంద్రశేఖర్ చిరస్మరణీయంగా నిలిచిపోయారని ప్రధాని అన్నారు. అచంచలమైన దేశభక్తితో, సామాన్య పౌరుల ఆకాంక్షల పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ.. శ్రీ చంద్రశేఖర్ ప్రజా జీవితానికి సరళతను, స్పష్టతను తీసుకొచ్చారని వివరించారు.
శ్రీ చంద్రశేఖర్‌ను కలుసుకొన్న, దేశాభివృద్ధికి సంబంధించిన ఆలోచలనను పంచుకొన్న సందర్భాలను ప్రధాని గుర్తు చేసుకున్నారు.
దేశ ప్రగతి గురించి శ్రీ చంద్రశేఖర్ ఆలోచనలు, ఆయన చేసిన ప్రయత్నాల గురించి చదవాలని భారత యువతకు ప్రధానమంత్రి పిలుపునిచ్చారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో శ్రీ మోదీ పోస్టు:
‘‘మాజీ ప్రధానమంత్రి శ్రీ చంద్రశేఖర్ జయంతి సందర్భంగా నివాళులర్పిస్తున్నాను. ఆయన శతజయంతి ప్రారంభాన్ని ఈ ఏడాది సూచిస్తుంది. అలాగే సుసంపన్నమైన నిష్పాక్షికమైన దేశంగా భారత్‌ను తీర్చిదిద్దాలనే ఆయన కలను సాకారం చేయడంలో మన అంకితభావాన్ని పునరుద్ఘాటించాల్సిన సమయమిది. ధైర్యం, దృఢ సంకల్పం, ప్రజాస్వామ్య విలువల పట్ల అంకితభావం ఉన్న ప్రజా నాయకుడిగా శ్రీ చంద్రశేఖర్ చిరస్మరణీయులు. అచంచలమైన దేశభక్తి, సామాన్య ప్రజల ఆకాంక్షల పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించి ప్రజా జీవితానికి సరళతను, స్పష్టతను తీసుకొచ్చారు. ఆయన్ను కలుసుకున్న, దేశాభివృద్ధి కోసం ఆలోచనలు పంచుకున్న సందర్భాలను గుర్తు చేసుకుంటున్నాను. భారత దేశ పురోగతి విషయంలో ఆయన ఆలోచనలు, చేసిన కృషి గురించి దేశ యువత చదవాలని పిలుపునిస్తున్నాను’’.
***
Tributes to former Prime Minister Chandra Shekhar Ji on his birth anniversary. This year marks the start of his 100th birth anniversary and is a time to reiterate our commitment to realising his vision for a prosperous and just India. Chandra Shekhar Ji is remembered as a mass… pic.twitter.com/Cf5P8k9n5I
— Narendra Modi (@narendramodi) April 17, 2026