పిఎంఇండియా
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ లోక్‌సభలో తన ప్రసంగం ముఖ్యాంశాలను ప్రజలతో పంచుకున్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో శ్రీ మోదీ వరుసగా సందేశాలను పొందుపరుస్తూ:..
‘‘మనమందరం అదృష్టవంతులం.. దేశ జనాభాలో సగమున్న వారిని దేశ నిర్మాణంలో భాగస్వాములను చేసే సౌభాగ్యం మనకు దక్కుతోంది. దేశ విధాన రూపకల్పనలో మన మహిళా శక్తి పాలుపంచుకోవాలని వర్తమానం కోరుకుంటోంది.’’
‘‘గత 25-30 సంవత్సరాల్లో, లక్షలాది మహిళలు క్షేత్ర స్థాయిలో లీడర్లుగానూ, ఒపీనియన్ మేకర్లుగానూ మారారు. ఈ కారణంగా వారిని వ్యతిరేకించే వ్యక్తులు చాలా కాలం పాటు ఇందుకు మూల్యాన్ని చెల్లించకోవలసి వస్తుంది.’’
‘‘దేశంలో మహిళా శక్తికి రిజర్వేషన్ కల్పించడం జాతికి మేలు చేసే నిర్ణయం. దీనిలో మన సంకల్పాన్ని తల్లులు, అక్కచెల్లెళ్లు, కుమార్తెలు గమనిస్తారు. ఇందువల్ల, దీనిని రాజకీయాల దృష్టికోణంలో నుంచి చూడకండి.’’
‘‘దేశంలోని మహిళాశక్తికి ఏదో అప్పగిస్తున్నామనే భ్రమను మనం పెంచుకోవద్దు. అంతకన్న, అది వారి హక్కుగా చూడండి. ఖ్యాతిని చేజిక్కించుకోవాలనేది మా అభిప్రాయం కాదు.. మహిళలకు మరింత సాధికారతను కల్పించాలనే భావనే మాకుంది.’’
‘‘మన దేశంలో అనుభవం కలిగిన మహిళా శక్తికి లోటు లేదు. సభతో పాటు దేశాన్ని కూడా సమృద్ధం చేయడానికి మహిళలు అమూల్య తోడ్పాటును అందిస్తారన్న నమ్మకం మనకుంది’’ అని పేర్కొన్నారు.
***
हम सब भाग्यवान हैं कि हमें राष्ट्र निर्माण में देश की आधी आबादी को हिस्सेदार बनाने का सौभाग्य मिल रहा है। यह समय की मांग है कि हमारी नारी शक्ति देश के नीति-निर्धारण का हिस्सा बने। pic.twitter.com/O0szhVSSbD
— Narendra Modi (@narendramodi) April 16, 2026
पिछले 25-30 वर्षों में लाखों महिलाएं ग्रास रूट लेवल पर लीडर और ओपिनियन मेकर बन चुकी हैं। इसलिए अब उनका विरोध करने वालों को लंबे समय तक इसकी कीमत चुकानी पड़ेगी। pic.twitter.com/0LYRfhQope
— Narendra Modi (@narendramodi) April 16, 2026
देश की नारी शक्ति को आरक्षण राष्ट्रहित का निर्णय है, जिसमें माताएं-बहनें और बेटियां हमारी नीयत को देखेंगी। इसलिए इसे राजनीति के तराजू से मत तोलिए। pic.twitter.com/YvINomHTTG
— Narendra Modi (@narendramodi) April 16, 2026
हम इस भ्रम में न रहें कि देश की नारी शक्ति को कुछ दे रहे हैं, बल्कि ये उसका हक है। हमारी भावना क्रेडिट लेने की नहीं, बल्कि महिलाओं को और सशक्त बनाने की है। pic.twitter.com/zN8ktiYMzf
— Narendra Modi (@narendramodi) April 16, 2026
हमारे देश में अनुभवी नारी शक्ति की कोई कमी नहीं है। हमें भरोसा है कि वे सदन के साथ-साथ राष्ट्र को समृद्ध करने में अपना अमूल्य योगदान देंगी। pic.twitter.com/TR6bdBHWBB
— Narendra Modi (@narendramodi) April 16, 2026