Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

గుజరాత్‌లోని సోమనాథ్‌ వద్ద సర్దార్ వల్లభభాయ్ పటేల్‌కు నివాళి అర్పించిన ప్రధాని


గుజరాత్‌లోని సోమనాథ్ వద్ద సర్దార్ వల్లభభాయ్ పటేల్‌కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హృదయపూర్వకంగా నివాళులు అర్పించారు.

సోమనాథ్ ఆలయాన్ని పునర్నిర్మించడంలో సర్దార్ పటేల్ దార్శనికత, సంకల్పం నిర్ణయాత్మక పాత్రను పోషించాయని ప్రధానమంత్రి అన్నారు. భారత దేశ నాగరికతా గర్వానికి, కొనసాగుతున్న ఆధ్యాత్మికతకు ప్రతీకగా సోమనాథ్ ఆలయం పూర్వ వైభవాన్ని పొందాలన్నదే సర్దార్ పటేల్ కల అని శ్రీ మోదీ తెలియజేశారు. దేశం కోసం సర్దార్ పటేల్ ఆశయాన్ని నెరవేర్చడానికి ఈ దేశం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని ఆయన చెప్పారు.

సామాజిక మాధ్యమం ఎక్స్ లో ప్రధానమంత్రి చేసిన పోస్టులు:

‘‘సోమనాథ్‌లో సర్దార్ వల్లభభాయి పటేల్‌కు హృదయపూర్వక నివాళులు అర్పించాను. ఆలయ పునర్నిర్మాణంలో ఆయన దార్శనికత, సంకల్పం నిర్ణయాత్మక పాత్ర పోషించాయి. భారత దేశ నాగరికతా గర్వానికి, కొనసాగుతున్న ఆధ్యాత్మికతకు ప్రతీకగా సోమనాథ్ పునర్వైభవం సాధించాలని ఆయన ఆకాంక్షించారు.

దేశం కోసం ఆయన ఆశయాలను నెరవేర్చేందుకు మేం కట్టుబడి ఉన్నాం.’’ 

‘‘సోమనాథ్‌లో సర్దార్ వల్లభభాయి పటేల్‌కు ఘన నివాళులు అర్పించాను. ఈ ఆలయ పునర్నిర్మాణంలో ఆయన దూర దృష్టి, దృఢ సంకల్పం నిర్ణయాత్మక భూమికను పోషించాయి. భారతీయ సాంస్కృతిక గర్వానికి, కొనసాగుతున్న ఆధ్యాత్మికతకు ప్రతీకగా సోమనాథ్ పూర్తి దివ్యత్వం, భవ్యత్వంతో పున:స్థాపితం కావాలన్నదే సర్దార్ పటేల్ కల.

దేశం కోసం ఆయన ఆశయాలను నెరవేర్చేందుకు మేం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటాం.’’

***