పిఎంఇండియా
మహాత్మ అయ్యన్కాళి జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఆయనకు నివాళులర్పించారు. అణగారిన వర్గాల సాధికారత, సంక్షేమం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన సామాజిక న్యాయ పోరాట యోధులు మహాత్మ అయ్యన్కాళి అని శ్రీ మోదీ కొనియాడారు. అణగారిన వర్గాలకు విద్యావకాశాలను కల్పించడం, వ్యవసాయ కూలీల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం, పేదలకు సేవ చేయడంలో ఆయన కృషిని ప్రధానమంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు.
‘ఎక్స్’ వేదికగా ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:
మహాత్మ అయ్యంకాళి జయంతి సందర్భంగా ఆ మహనీయునికి నివాళులు!
సామాజిక న్యాయానికి గొప్ప మార్గదర్శకుడిగా ఆయన చిరస్మరణీయులు. అణగారిన వర్గాలకు విద్యావకాశాలు కల్పించడానికి, వ్యవసాయ కూలీల జీవితాలను మెరుగుపరచడానికి, పేదలకు సేవ చేయడానికి ఆయన చేసిన కృషి ఎంతో స్ఫూర్తిదాయకం. ఆయన జీవితం సామాజిక సాధికారత కోసం పనిచేసే వారందరికీ శక్తినిస్తుంది.
Paying homage to Mahatma Ayyankali on his birth anniversary!
— Narendra Modi (@narendramodi) August 28, 2026
He is remembered as a great pioneer of social justice. His efforts to secure educational opportunities for the marginalised, improve the lives of agricultural workers and serve the poor remain very inspiring. His life…