Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఆసియా కప్ హాకీ విజేత భారత జూనియర్ పురుషుల జట్టుకు ప్రధానమంత్రి అభినందనలు


సియా కప్‌ జూనియర్‌ పురుషుల హాకీ ట్రోఫీని కైవసం చేసుకున్న భారత జట్టును ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు. దక్షిణ కొరియాతో తుది పోరులో 4-1 గోల్స్‌ తేడాతో ఘన విజయం సాధించడం ఎంతో ఆనందదాయకమని ఆయన కొనియాడారు.

భారత హాకీకి ఇదొక అద్భుత ఘనత కాగా, యువ క్రీడాకారుల అసమాన ప్రతిభకు ఈ విజయం నిదర్శనమని ప్రధానమంత్రి పేర్కొన్నారు. తిరుగులేని క్రీడా పాటవంతో విజయపథాన సాగిన జట్టు మొత్తానికీ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’ ద్వారా పంపిన సందేశంలో:

“ఆసియా కప్‌ జూనియర్‌ హాకీ ఫైనల్‌లో 4-1 తేడాతో ఘన విజయం ద్వారా ట్రోఫీ గెలుచుకున్న మన పురుషుల హాకీ జట్టుకు అభినందనలు. నిజంగా ఈ విజయం ఒక అద్భుత ఘనత… మన యువ క్రీడాకారుల అసమాన ప్రతిభకు నిదర్శనం. జట్టు మొత్తానికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు!” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.