పిఎంఇండియా
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు… 46వ ఫిడె చెస్ ఒలింపియాడ్‌లో విజయం సాధించిన భారతీయ చదరంగ క్రీడాకారులను అభినందించారు.
వారి అంకితభావం, సంకల్పం ఆదర్శప్రాయమని ప్రధానమంత్రి అన్నారు. వారు సాధించిన విజయాలు… చదరంగం ఆడేలా, ఈ క్రీడలో రాణించేలా మరింత మంది యువతకు స్ఫూర్తినిస్తుందనే విశ్వాసం వ్యక్తం చేశారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి చేసిన పోస్టు:
‘‘మన చెస్ క్రీడాకారులకు అభినందనలు! వారి అంకితభావం, సంకల్పం ఆదర్శప్రాయమైనవి.
ఈ విజయాలు చెస్ ఆడేలా, ఈ క్రీడలో రాణించేలా మరింత మంది యువతకు స్పూర్తినిస్తాయని ఆశిస్తున్నాను’’.
Congratulations to our Chess players! Their passion and determination are exemplary.
— Narendra Modi (@narendramodi) September 28, 2026
May these successes motivate several more youngsters to play chess and excel. https://t.co/u1OyYs6LAj