Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

కుచి రంగ్కా జెలియాంగ్ మృతి పట్ల సంతాపం తెలిపిన ప్రధానమంత్రి


నాగాలాండ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ టి.ఆర్. జెలియాంగ్ కుమారుడు శ్రీ కుచి రంగ్కా జెలియాంగ్ మృతిపట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. ఈ కష్ట సమయంలో కుటుంబసభ్యులకు, వారి మిత్రులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కుచి రంగ్కా ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు.

నాగాలాండ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ టి.ఆర్. జెలియాంగ్ కుమారుడు శ్రీ కుచి రంగ్కా జెలియాంగ్ ఆకస్మిక మరణం బాధాకరం. ఈ కష్ట సమయంలో కుటుంబసభ్యులకు, వారి మిత్రులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. కుచి రంగ్కా ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా

.