దీపావళి పర్వదినం సందర్భంగా దేశ ప్రజలందరికీ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
దీపాల పండుగ దేశమంతటినీ వెలుగులతో నింపుతుందని, చీకటిని అధిగమించాలనే సంకల్పానికి ప్రతీకగా నిలుస్తుందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఈ పండుగతో పాటు రాబోయే రోజులు కూడా ప్రతి ఒక్కరికీ ఆనందం, శాంతి, సౌభాగ్యాన్ని తీసుకురావాలని ఆకాంక్షించారు.
తాను ఎంతో ఉత్సాహంగా దీపావళి పండుగను జరుపుకుంటానని శ్రీ మోదీ తెలిపారు. గత సంవత్సరాల మాదిరిగానే ఈ ఏడాది కూడా దేశంలోని ధైర్యసాహసాలు కలిగిన సైనికులతో కలిసి దీపావళి వేడుకలు జరుపుకునే సంప్రదాయాన్ని కొనసాగిస్తానని పేర్కొన్నారు.
దీపావళి శుభాకాంక్షలకు సంబంధించిన వీడియో సందేశాన్ని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ప్రధానమంత్రి పంచుకున్నారు.
“అందరికీ దీపావళి శుభాకాంక్షలు!” అని పేర్కొన్నారు.
Have a great Diwali! https://t.co/YbFVq7tHmx
— Narendra Modi (@narendramodi) November 7, 2026