Search

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి.. చీకటిపై పోరాట సంకల్పానికి ప్రతీక ఈ పండుగ!


దీపావళి పర్వదినం సందర్భంగా దేశ ప్రజలందరికీ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

దీపాల పండుగ దేశమంతటినీ వెలుగులతో నింపుతుందని, చీకటిని అధిగమించాలనే సంకల్పానికి ప్రతీకగా నిలుస్తుందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఈ పండుగతో పాటు రాబోయే రోజులు కూడా ప్రతి ఒక్కరికీ ఆనందం, శాంతి, సౌభాగ్యాన్ని తీసుకురావాలని ఆకాంక్షించారు.

తాను ఎంతో ఉత్సాహంగా దీపావళి పండుగను జరుపుకుంటానని శ్రీ మోదీ తెలిపారు. గత సంవత్సరాల మాదిరిగానే ఈ ఏడాది కూడా దేశంలోని ధైర్యసాహసాలు కలిగిన సైనికులతో కలిసి దీపావళి వేడుకలు జరుపుకునే సంప్రదాయాన్ని కొనసాగిస్తానని పేర్కొన్నారు.

దీపావళి శుభాకాంక్షలకు సంబంధించిన వీడియో సందేశాన్ని సామాజిక మాధ్యమం ఎక్స్‌ వేదికగా ప్రధానమంత్రి పంచుకున్నారు.

“అందరికీ దీపావళి శుభాకాంక్షలు!” అని పేర్కొన్నారు.