Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

బిమ్స్ టెక్ 20 వార్షికోత్సవం సందర్భంగా బిమ్స్ టెక్ దేశాలకు అభినందనలు తెలిపిన ప్రధాన మంత్రి


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ-సెక్టొరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ (బిమ్స్ టెక్) 20వ వార్షికోత్సవం సందర్భంగా బిమ్స్ టెక్ లో సభ్యత్వం ఉన్న దేశాలకు అభినందనలు తెలిపారు. “ఈ రోజు ఒక ప్రత్యేకమైన రోజు. మనం బిమ్స్ టెక్ 20వ వార్షికోత్సవాన్ని జరుపుకొంటున్నాం. బిమ్స్ టెక్ లో సభ్యత్వం కలిగివున్న దేశాలన్నింటికి ఇవే నా అభినందనలు.

ప్రాంతీయ సహకారానికి బిమ్స్ టెక్ ఒక సిసలైన వేదికగా నిలుస్తోంది. శాంతి, అభివృద్ధి పట్ల నిబద్ధతే బిమ్స్ టెక్ కుటుంబాన్ని అన్యోన్యంగా కలిపి ఉంచుతోంది”, ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.