పిఎంఇండియా
గౌరవ ప్రధాన మంత్రి ఎండా కెన్నీ !
మీడియా సభ్యులారా !
ఐర్లాండ్‌కు రావడం నాకు ఎంతో సంతోషం కలిగిస్తోంది. ఇది స్వల్పకాల పర్యటనే అయినప్పటికీ చారిత్రాత్మక పర్యటన. భారత దేశ ప్రధాన మంత్రి ఐర్లాండ్‌లో పర్యటించడానికి 59 ఏళ్ల సుదీర్ఘ సమయం పట్టింది. మీ సాదరపూర్వక స్వాగతానికి, ఉదార ఆతిథ్యానికి ధన్యవాదాలు. భారత్ తో స్నేహ సంబంధాల పట్ల మీరు ఎంతో ఆదరంతో వెలిబుచ్చిన మాటలకు కృతజ్ఞతలు. భారత్ – ఐర్లాండ్ దేశాలకు సంబంధించిన పలు అంశాలు చాలా వరకు ఒకే మాదిరిగా ఉంటాయి. ఇరు దేశాల వలసవాద చారిత్రక అంశాలను పోల్చి చూసుకున్నప్పుడు ఇది తెలుస్తుంది. మన ఉభయ దేశాలకు చెందిన పవిత్ర రాజ్యాంగాలకు కూడా పోలిక ఉంది. ఐరిష్ రాజ్యాంగం ఇచ్చిన స్ఫూర్తితోనే భారత రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాల రూపకల్పన జరిగింది. జీయలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియా వంటి సంస్థలను ఐరిష్ నిపుణులు మనకు అందించారు. ఐర్లాండ్‌లో రగ్బీ ఆటకు ఉన్నఆసక్తిని ప్రాముఖ్యతను నేడు భారత్ లోని క్రీడల సామాగ్రి ఉత్పత్తిదారులు గమనంలోకి తీసుకున్నారు. రవీంద్రనాధ్ టాగోర్ – డబ్ల్యు. బి.యీట్స్ మధ్య గల మైత్రీ బంధం మొదలుకొని, భారత్ కు సిస్టర్ నివేదిత అందించిన ఆధ్యాత్మిక సేవలను ఒక్కపారి మననం చేసుకున్నప్పుడు, ఇరు దేశాల ప్రజల మధ్య స్నేహ బాంధవ్యాలు ఎంత ప్రగాఢంగా పెనవేసుకుని పోయి దృఢంగా మారాయో మనకు అర్ధమవుతుంది.. నేడు ఐర్లాండ్‌లోని ఐరిష్ ప్రజలతో పాటు 26,000 భారతీయులు ఐర్లాండ్‌లో ఒక భాగంగా మారారు. ఎయర్ ఇండియా కనిష్క విమాన ప్రమాదంలో మరణించిన బాధిత కుటుంబాలకు ఐర్లాండ్ ఒక విశ్రాంత స్థలంగా మారింది. ఆ ఘోర ప్రమాదం జరిగి 30 ఏళ్లు గడిచింది. ఆ విమాన ప్రమాద దుర్ఘటనలో మరణించిన వారి స్మారకార్ధం స్మృతి చిహ్నం ఏర్పాటు
చేసినందుకు మరో సారి కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాం. చెరిగిపోలేని ఈ జ్ఞాపకాల మాటున, బాధాతప్త హృదయులైన మనకు అనునిత్యం ఎదుర్కొంటున్న సవాళ్లు, ఆశలు, ఆశయాలు, ఆకాంక్షలు బాధ్యతను గుర్తు చేస్తున్నాయి. భారత్ – ఐర్లాండ్ దేశాల మధ్య సన్నిహిత భాగస్వామ్యం, సహకారానికి మరింత ప్రాముఖ్యత ఇవ్వవలసిన అవసరం ఉంది. భారత్ -ఐర్లాండ్ దేశాల ఆర్ధిక వ్యవస్థలు ఆసియా, యూరప్ లలో శీఘ్ర గతిన విస్తరిస్తున్నాయి.ప్రపంచ వ్యాప్తంగా ఆర్ధిక రంగంలో అనిశ్చిత పరిస్థితులు ఏర్పడినప్పటికీ, ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులకు సంబంధించిన సంబంధాలు మెరుగు పడుతుండటం హర్షదాయకం. సమాచార సాంకేతిక పరిజ్ఞానం, బయో టెక్నాలజీ, ఔషద తయారీ, వ్యవసాయం, శుద్ధ ఇంధనం తదితర రంగాలపై ప్రముఖంగా దృష్టి సారించి ఆర్ధికంగా సహకరించుకోవలసిన అవసరం ఉంది. వాణిజ్యం , పెట్టుబడులకు సంబంధించి భారత్-యూరోపియన్ యూనియన్ ల మధ్య విస్తృత ప్రాతిపదికన కుదుర్చుకున్న ఒప్పందం పై చర్చలు తిరిగి ప్రారంభం కావడానికి ఈయూ స్పందన మరింత అవసరం. నేటి డిజిటల్ యుగంలో అవకాశాలను అందిపుచ్చుకునేందుకు వీలుగా ఉత్పాదక భాగస్వామ్య దేశాలుగా భారత్, ఐర్లాండ్ దేశాలు కీలక స్థానాల్లో ఉన్నాయి. మా ఇన్ ఫర్మేషన్ టెక్నాలజీ జాయింట్ వర్కింగ్ గ్రూప్ ఈ సహకారానికి సంబంధించిన రోడ్ మ్యాప్ ఖరారు చేసేందుకు త్వరలోనే సమావేశం కాగలదని ఆశిస్తున్నాను. ఇక ఐర్లాండ్ వీసా విధానం భారత సమాచార సాంకేతిక విజ్ఞాన సంస్థల అవసరాలకు స్పందించేలా ఉంటుందని ఆశిస్తున్నాను. ఇరు దేశాలకు చెందిన నిపుణులకు ఎంతగానో తోడ్పడే సామాజిక భద్రత ఒప్పందాన్నికుదుర్చుకోవడంలో ఆసక్తి కనబరుస్తున్నామని కూడా తెలియచేశాను. భారత్ – ఐర్లాండ్ దేశాల మధ్య నేరుగా విమాన సర్వీసులు త్వరలోనే ప్రారంభం కావడం ఎంతో సంతోషకరమైన విషయం. దీని వల్ల వ్యాపార సంబంధాలు మెరుగుపడటమే కాకుండా, ఇప్పటికే 14 శాతం ఉన్న పర్యాటక రంగానికి మరింత ఊతం ఇవ్వగలదని భావిస్తున్నాను. మన రెండు దేశాలు కూడా శాస్త్ర సాంకేతిక విజ్ఞానం, విద్యా రంగాలలో ఎంతో కాలంగా పరస్పర సహకారం అందించుకుంటునే ఉన్నాయి. కర్నాటకలో ఉన్న ఐర్లాండ్ సైన్ప్ సెంటర్ దీనికి ఒక చక్కటి ఉదహరణగా నిలుస్తుంది. ఉగ్రవాదం, తీవ్రవాదంతో పాటు అంతర్జాతీయ సవాళ్లు, యూరప్ – ఆసియాలో పరిస్థితులపై విస్తృత స్థాయిలో అభిప్రాయాలను పంచుకోవడం నాకు ఎంతో సంతోషం కలిగిస్తోంది. ప్రజాస్వామ్య విలువలతో విలసిల్లుతూ , నిరంతరం ప్రపంచ శాంతి, సుస్థిరత గురించి ప్రవచించే భారత్ – ఐర్లాండ్ దేశాల మధ్య సహకారానికి మరింత ప్రాముఖ్యత ఇవ్వవలసిన అవసరం గురించి మా చర్చలలో ప్రముఖంగా ప్రస్తావించడం జరిగింది. 21వ శతాబ్దంలో ఐక్యరాజ్య సమితి భద్రత మండలి ఈ సవాళ్లను ఏ విధంగా ఎదుర్కొనగలదనే విషయాన్ని, వాటి పాత్ర గురించి చర్చించాం. భారత్, ఐర్లాండ్ దేశాలు శాంతి స్థాపన చర్యలలో భాగస్వాములుగా ఉన్న విషయం తెలిసిందే. నిరంతర అభివృద్ధి సాధన దిశగా ఆ లక్ష్య సాధన కోసం కృషి చేస్తున్న ఐర్లాండ్ ప్రభుత్వానికి , నాయకత్వానికి నా కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను. ఐక్య రాజ్య సమితి భద్రత మండలిలో – నిర్ణీత వ్యవధిలో సంస్కరణలు తీసుకువచ్చేందుకు, ఐరాస 70వ సంవత్సరంలో సంప్రదింపులను విజయవంతంగా ముగించినందుకు మద్దతు ఇవ్వాలని ఐర్లాండ్ ను కోరాను. ఐక్య రాజ్య సమితి భద్రత మండలిలో భారత్ కు శాశ్వత సభ్యత్వం కల్పించడానికి మద్దతు ఇవ్వాలని కూడా అభ్యర్ధించాను. భారత్, ఐర్లాండ్ దేశాలు శాంతిని కాంక్షించే దేశాలు. అణ్వస్త్ర నిరాయుధీకరణ విషయంలో మేం ఇరువురం ముందు భాగంలో ఉన్నాం ! ఈ విషయంలో ఐర్లాండ్ కనబరుస్తున్న ధృఢమైన, నిబద్ధతతో కూడిన వైఖరిని మేం గౌరవిస్తాం. స్వాతంత్రానంతర సమయం నుంచి కూడా విశ్వ వ్యాప్త అణు నిరాయుధీకరణ విషయంలో భారత్ తన వాణిని గట్టిగానే వినిపిస్తొంది. నిరాయుధీకరణ విషయంలో మా విశ్వసనీయతను ఎవరూ వేలెత్తి చూపలేరు. ఎవరైనా మా తర్వాతే ! 2008లో అణు సరఫరాదారుల బృందం ( ఎన్ ఎస్ జీ) నుంచి భారత్ ను ప్రత్యేకంగా మినహాయించడంలో ఐర్లాండ్ ఇచ్చిన మద్దతు ఎంతో కీలకమైనది. భారత్ లో ఇంధన డిమాండు విస్తృతంగా పెరుగుతున్న కారణంగా, నిరంతర అభివృద్ధి పంథాను అనుసరించడానికి ఇది ఎంతగానో దోహదపడింది. ఎన్ ఎస్ జీతో పాటు ఇతర అంతర్జాతీయ ఎగుమతి విధానాలలో కూడా భారత్ కు సహకరించాలని ఈ పర్యటన సందర్భంగా ఐర్లాండ్‌ను కోరాను. ఎన్ ఎస్ జీ లోను, ఇతర అంతర్జాతీయ ఎగుమతి విధానాలలోను భారత్‌కు సభ్యత్వం ఇవ్వడం ద్వారా – ద్వైపాక్షిక సహకారాన్ని, అంతర్జాతీయ అణు వ్యాప్తి నిరోధక ప్రయత్నాలను బలోపేతం చేయగలదు.
ప్రధాన మంత్రి గారూ ! మన ఇరు దేశాల మధ్య పెట్టుబడి సంబంధాలు పుంజుకుంటున్నాయి. ఆసియాలో దౌత్య సంబంధాల స్థాపన కోసం మీరు ఎంచుకున్న తొలి దేశం భారత దేశం. ఆసియాలో ఇప్పుడు మేం మీకు అండగా ఉంటాం. అదే విధంగా యూరప్ కు గేట్ వే – అట్లాంటిక్ పై బ్రిడ్జి మాదిరిగా పేరు పొందిన ఐర్లాండ్ – భారత దేశానికి ఎంతో ప్రధానమైదని నేను భావిస్తున్నాను.
మీ ఆతిథ్యానికి మరోసారి కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను. మీరు భారత్ ను సందర్శించి కొన్ని దశాబ్దాలు దాటింది.
మీ రాక కోసం ఎదురు చూస్తుంటాను….
ధన్యవాదాలు..
Thank you for your very warm reception and gracious hospitality: PM @narendramodi thanks Mr. @EndaKennyTD https://t.co/ZMB9gwRRFG
— PMO India (@PMOIndia) September 23, 2015
India and Ireland share much in common. Directive Principles of State Policy in Indian Constitution are inspired by Irish Constitution: PM
— PMO India (@PMOIndia) September 23, 2015
We are pleased that our bilateral trade & investment ties are growing, despite global and regional uncertainties: PM https://t.co/ZMB9gwRRFG
— PMO India (@PMOIndia) September 23, 2015
India and Ireland are ideally placed to form productive partnerships to take advantage of the opportunities in the digital age: PM
— PMO India (@PMOIndia) September 23, 2015
Exchanged views on broad range of global challenges including terror, radicalisation, and the situation in Europe and Asia: PM @narendramodi
— PMO India (@PMOIndia) September 23, 2015
I have now sought Ireland’s support for India’s membership of the NSG and other international export control regimes: PM @narendramodi
— PMO India (@PMOIndia) September 23, 2015
India can be Ireland's anchor in Asia & Ireland can be India's vital gateway to Europe & bridge across the Atlantic. http://t.co/Dkjc9Kt5Nb
— Narendra Modi (@narendramodi) September 23, 2015