Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

మాస్కో లో విమాన ప్ర‌మాదంలో ప్రాణ న‌ష్టం జ‌ర‌గ‌డం ప‌ట్ల విచారం వ్య‌క్తం చేసిన ప్ర‌ధాన మంత్రి


మాస్కో లో విమాన ప్ర‌మాదం సంభవించి ప్రాణ నష్టం జరిగినందుకు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ సంతాపాన్ని వ్య‌క్తం చేశారు.

‘‘మాస్కో లో ఈ రోజు సంభవించిన విమాన ప్ర‌మాదంలో ప్రాణ నష్టం జరగడం శోచనీయం. ఈ విషాద సంఘటనలో మృతులకు ఇదే నా ప్ర‌గాఢ సంతాపం. బాధిత కుటుంబాల యొక్క శోకంలో నేను కూడా పాలుపంచుకొంటున్నాను’’ అని ప్ర‌ధాన మంత్రి త‌న సందేశంలో పేర్కొన్నారు.

***