Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

టెహరాన్ లోని భాయి గంగా సింగ్ సభా గురుద్వారా లో ప్రార్థనలు జరిపిన ప్రధాన మంత్రి; కూటమిని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు సాయంత్రం టెహరాన్ కు చేరుకొన్న కొద్ది సేపటి తరువాత భాయి గంగా సింగ్ సభా గురుద్వారా ను సందర్శించారు. ఆ సందర్భంగా గురు గ్రంథ్ సాహిబ్ కు నమస్సులు అర్పించారు.

ఆయనకు ఒక సరోపా ను, తల్ వార్ ను బహూకరించారు.

కూటమిని ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, మన ఘనమైన వారసత్వాన్ని, సంప్రదాయాలను రాబోయే తరాల వారి కోసం పరిరక్షిస్తున్నందుకు టెహరాన్ లోని సిక్కు సముదాయానికి అభినందనలు తెలిపారు. భారతీయులు వసుధైవ కుటుంబకం (యావత్ ప్రపంచం మన కుటుంబం) అనే భావనను విశ్వసిస్తారని, కాబట్టే ప్రతి ఒక్కరితో ఇట్టే కలసిపోతుంటారని ఆయన చెప్పారు.

గురు గోబింద్ సింగ్ 350వ జయంతి సందర్భాన్ని భారతదేశంతో పాటు ప్రపంచంలోని ఇతర ప్రాంతాలలో కూడా ఒక పండుగలా జరుపుకొంటారని ప్రధాన మంత్రి అన్నారు; ఈ సందర్భాన్ని పురస్కరించుకొని గురువుల ప్రాణ సమర్పణం గురించి, ఇంకా పవిత్ర గ్రంథమైన గురు గ్రంథ్ సాహిబ్ సందేశాన్ని గురించి రాబోయే తరాల వారిలో మహా చైతన్యాన్ని ఏర్పరచడం జరుగుతుందని ఆయన వెల్లడించారు.