Search

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

వాణిజ్య తరహా తవ్వకాల కోసం బొగ్గు బ్లాకు ల యొక్క వేలం ప్ర‌క్రియ‌ ను ప్రారంభించిన ప్ర‌ధాన‌ మంత్రి


 

 

ప్ర‌ధాన‌ మంత్రి శ్రీ న‌రేంద్ర‌ మోదీ ఈ రోజు న న్యూఢిల్లీ నుండి వీడియో కాన్ఫ‌రెన్స్ మాధ్యమం ద్వారా 41 బొగ్గు బ్లాకుల వాణిజ్య సరళి తవ్వకాల కు సంబంధించిన‌ వేలంపాట ప్ర‌క్రియ‌ ను ప్రారంభించారు. ఆత్మ‌నిర్భ‌ర భార‌త్ అభియాన్ లో భాగం గా భార‌త ప్ర‌భుత్వం చేసిన ప‌లు ప్ర‌క‌ట‌న‌ల లో ఇది ఒక భాగం. బొగ్గు గ‌నుల వేలం ప్ర‌క్రియ‌ ను బొగ్గు మంత్రిత్వ‌ శాఖ ఫిక్కి స‌హ‌కారం తో మొదలుపెట్టింది. బొగ్గు గ‌నుల కేటాయింపున‌కు సంబంధించి రెండంచెల ఇలెక్ట్రానిక్ ఆక్శన్ ప్రోసెస్ ను అనుసరించ‌నున్నారు.

ఈ సంద‌ర్భం లోల ప్ర‌ధాన‌ మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ మాట్లాడుతూ, భారతదేశం, కోవిడ్ -19 సంక్షోభం నుండి బ‌య‌ట ప‌డుతుంద‌ని, దేశం ఈ సంక్షోభాన్నిఒక అవ‌కాశం గా మార్చుకుంటుంద‌న్నారు. ఈ సంక్షోభం భారతదేశాని కి ఆత్మ‌నిర్బ‌రత ను అంటే స్వావ‌లంబ‌న సాధించవలసిన పాఠాన్ని బోధించింద‌ని ప్ర‌ధాన‌ మంత్రి చెప్పారు. ఆత్మ‌నిర్భ‌ర భార‌త్ అంటే దిగుమ‌తుల‌ పై భారం త‌గ్గించ‌డం, దిగుమ‌తుల పై విదేశీ క‌రెన్సీ ఖ‌ర్చు కాకుండా పొదుపు చేయ‌డ‌మ‌ని ప్రధాన మంత్రి అన్నారు. దీని వ‌ల్ల భారతదేశం దేశీయం గా వ‌న‌రుల‌ ను అభివృద్ది చేసుకోగ‌లుగుతుందని, ఫ‌లితం గా దిగుమ‌తుల‌ పై ఆధార‌ప‌డవలసిన అవ‌స‌రం ఉండ‌ద‌న్నారు. అంటే ప్ర‌స్తుతం మ‌నం పెద్ద ఎత్తున దిగుమ‌తులు చేసుకుంటున్న‌ స‌ర‌కు ల విష‌యంలో పెద్ద ఎగుమ‌తిదారు గా ఎద‌గ‌డ‌మ‌న్న‌మాట‌.

దీని ని సాధించ‌డానికి ప్ర‌తి రంగం, ప్ర‌తి ఉత్ప‌త్తి, ప్ర‌తి సేవ ను దృష్టి లో పెట్టుకొని ఆయా రంగాల‌ లో స్వావ‌లంబ‌న సాధ‌న‌ కు ప‌రిపూర్ణ దృష్టి తో ప‌నిచేయ‌డం జ‌రిగింద‌ని ప్ర‌ధాన‌ మంత్రి చెప్పారు. ఇవాళ చేప‌ట్టిన కీల‌క‌ చ‌ర్య‌ వ‌ల్ల ఇంధ‌న రంగం లో దేశం స్వావ‌లంబ‌న సాధిస్తుంద‌న్నారు. ప్ర‌స్తుత నిర్ణ‌యం తో బొగ్గు తవ్వకం రంగం లో సంస్క‌ర‌ణ‌ల‌ ను అమ‌లు చేయ‌డం మాత్ర‌మే కాక‌, యువ‌త‌ కు పెద్ద ఎత్తున ఉపాధి అవ‌కాశాలు ల‌భించ‌డానికి ఇది ఆరంభం కానున్న‌ద‌ని చెప్పారు. ఇవాళ మ‌నం వాణిజ్య బొగ్గు గ‌నుల‌ కు సంబంధించిన వేలంపాట ను ప్రారంభించ‌డం మాత్ర‌మే కాక , బొగ్గు రంగాన్ని ద‌శాబ్దాల తరబడి గా కొనసాగినటువంటి లాక్‌ డౌన్ నుండి విముక్తి చేసినట్లు కూడా అయింది అని ఆయ‌న‌ చెప్పారు.

బొగ్గు నిల్వ‌ల‌ లో ప్ర‌పంచం లో నాలుగో స్థానం లో భార‌త‌దేశం ఉంద‌ని, రెండో అతి పెద్ద ఉత్ప‌త్తి దారు గా కూడా భారతదేశం ఉంద‌ని, అయితే రెండో అతి పెద్ద బొగ్గు దిగుమ‌తి దారు దేశం గా ఉన్న‌ది కూడా మ‌న దేశ‌మే అని ప్ర‌ధాన‌ మంత్రి అన్నారు. ఇటువంటి ప‌రిస్థితి గ‌త కొన్నిద‌శాబ్దాలు గా ఉంద‌ని, బొగ్గు రంగాన్ని కేప్టివ్‌, నాన్ కేప్టివ్ గ‌నుల చిక్కుముడి లో ప‌డిపోయేటట్టు చేశార‌న్నారు. ఈ రంగాన్ని స్పర్ధ కు మరియు పార‌ద‌ర్శ‌క‌త్వాని కి దూరం గా ఉంచ‌డం వ‌ల్ల అది ఒక పెద్ద స‌మ‌స్య గా మారింద‌న్నారు. ఫ‌లితం గా బొగ్గు రంగం లో పెట్టుబ‌డులు లేకుండా పోయాయ‌ని, దాని స‌మ‌ర్ధ‌త కూడా ప్ర‌శ్నార్థ‌కం గా మారింద‌ని ప్రధాన మంత్రి అన్నారు.

2014వ సంవత్సరం లో బొగ్గు లింకేజ్ ను ప్ర‌వేశ‌పెట్ట‌డం జ‌రిగింద‌ని, ఇది బొగ్గు రంగం లో పురోగ‌తి కి దారి తీసిందని ప్ర‌ధాన‌ మంత్రి అన్నారు. బొగ్గు, గ‌నుల రంగం లో మ‌రింత పోటీ కి వీలు క‌ల్పిస్తూ ఈ రంగాల ద్వారాల ను పూర్తి గా తెర‌వాల‌న్న కీల‌క నిర్ణ‌యాన్ని భారతదేశం తీసుకుందని ఆయ‌న‌ చెప్పారు. గ‌నులు, ఖ‌నిజ రంగం బ‌లం గా లేనిదే స్వావ‌లంబ‌న సాధ్యం కాద‌ని, ఆర్థిక వ్య‌వ‌స్థ‌ కు ఇవి రెండూ ప్ర‌ధాన స్తంభాల వంటివి అని ఆయ‌న అన్నారు.

ప్ర‌స్తుత సంస్క‌ర‌ణ‌ల అనంతరం బొగ్గు ఉత్ప‌త్తి, అలాగే మొత్తం బొగ్గు రంగం స్వావ‌లంబ‌న ను సాధిస్తాయని ప్రధాన మంత్రి అన్నారు. ఇక ఇప్పుడు బొగ్గు కు బజారు తెరచుకొన్నదని ఆయన చెప్పారు. దీని వ‌ల్ల ఏ రంగ‌మైనా త‌మ అవ‌స‌రాల‌ కు అనుగుణం గా బొగ్గు ను కొనుగోలు చేయ‌వచ్చ‌ని అన్నారు. ఈ సంస్క‌ర‌ణ‌ లు బొగ్గు రంగానికి మాత్ర‌మే కాక ఇత‌ర రంగాలైన ఉక్కు, అల్యూమినియమ్, ఎరువులు, సిమెంట్ రంగాల‌ కు కూడా ప్ర‌యోజ‌నం క‌లిగించ‌నున్నాయ‌ని చెప్పారు. ఇది విద్యుత్తు ఉత్ప‌త్తి ని పెంచ‌డానికి కూడా ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని అన్నారు.

ఖ‌నిజ‌ రంగం లో సంస్క‌ర‌ణ‌ల కు బొగ్గు గ‌నుల రంగం లో సంస్క‌ర‌ణ‌ ల నుండి బ‌లం వ‌చ్చింద‌ని, దీనికి కార‌ణం ఇనుము, బాక్సైట్, ఇత‌ర ఖ‌నిజాలు చాలావ‌ర‌కు బొగ్గు నిక్షేపాల‌ కు ద‌గ్గ‌ర‌గా ఉండటమే అని ప్ర‌ధాన‌ మంత్రి చెప్పారు. బొగ్గు వాణిజ్య మైనింగ్ కు సంబంధించి ఈ రోజు ప్రారంభ‌మైన వేలం, ప‌రిశ్ర‌మ‌లోని స్టేక్ హోల్డ‌ర్లు, ప‌రిశ్ర‌మ‌ల వారంద‌రికీ సానుకూల ప‌రిస్థితులు క‌ల్పించేదే అన్నారు. రాష్ట్ర ప్ర‌భుత్వాలు దీనివ‌ల్ల మ‌రింత రాబ‌డి ని పొందుతాయ‌ని, దేశం లో పెద్ద సంఖ్య‌ లో ప్ర‌జ‌లు ఉపాధి ని పొంద‌గ‌లుగ‌తార‌ని చెప్పారు. ప్ర‌తి రంగం పై దీని సానుకూల ప్ర‌భావం ఉంటుంద‌ని ఆయ‌న చెప్పారు.

ప‌ర్యావ‌ర‌ణ ర‌క్షణ విష‌యం లో భారతదేశం చిత్త‌శుద్ది, బొగ్గు రంగం లో సంస్క‌ర‌ణ‌ ల అమ‌లు కార‌ణంగా బ‌ల‌హీనప‌డ‌కుండా చూడ‌డం జ‌రిగింద‌ని ప్ర‌ధాన‌ మంత్రి చెప్పారు. బొగ్గు నుండి గ్యాస్ ను ఉత్ప‌త్తి చేసేందుకు ఆధునిక సాంకేతిక ప‌రిజ్ఞానాన్ని వినియోగించ‌వ‌చ్చ‌ని కోల్ గ్యాసిఫికేశన్ ద్వారా ప‌ర్యావ‌ర‌ణాన్ని ప‌రిర‌క్షించ‌వ‌చ్చ‌ని ప్రధాన మంత్రి అన్నారు. కోల్ గ్యాస్‌ ను ర‌వాణారంగం లో, వంట‌గ్యాస్ గా , యూరియా త‌యారీ, ఉక్కు రంగాల‌లోనూ వాడ‌వ‌చ్చని చెప్పారు. ఇది త‌యారీ ప‌రిశ్ర‌మ‌ ను ప్రోత్స‌హిస్తుంద‌ని ప్ర‌ధాన‌ మంత్రి అన్నారు. 2030వ సంవత్సరానికల్లా సుమారు 100 మిలియ‌న్ ట‌న్ను ల బొగ్గు నుండి గ్యాస్ త‌యారు చేయాలని ప్ర‌భుత్వం ల‌క్ష్యం గా నిర్ణ‌యించుకుంద‌ని ప్ర‌ధాన‌ మంత్రి తెలిపారు. ఇందుకు నాలుగు ప్రాజెక్టులు గుర్తించార‌ని, ఇందులో 20 వేల కోట్ల రూపాయ‌ల పెట్టుబ‌డులు పెట్ట‌డం జ‌రుగుతుంద‌ని ప్రధాన మంత్రి చెప్పారు.

బొగ్గు రంగం లో తీసుకు వ‌చ్చిన సంస్క‌ర‌ణ‌ల తో తూర్పు, మ‌ధ్య భార‌తం, మ‌న గిరిజ‌న ప్రాంతాలు అభివృద్ధి కి స్తంభాలు అవుతాయ‌ని ప్రధాన మంత్రి అన్నారు. ఈ ప్రాంతాల‌ లో చాలా ఆకాంక్షభరిత జిల్లా లు ఉన్నాయ‌ని, ఆశించిన అభివృద్ధి కి, సుసంప‌న్న‌త‌ కు నోచుకోని జిల్లాల‌ు ఇవి అని ఆయన అన్నారు. దేశం లోని 16 ఆకాంక్షభరిత జిల్లాల‌ లో బొగ్గు నిల్వ‌లు భారీ గా ఉన్నాయ‌ని, అయితే వీటి నుండి త‌గిన ఫ‌లితాల ను ఈ ప్రాంత ప్ర‌జ‌లు పొంద‌లేక పోయార‌ని ఆయన చెప్పారు. ఈ ప్రాంతాల‌ కు చెందిన ప్ర‌జ‌లు ఉపాధి కోసం సుదూర ప్రాంతాల‌ కు వ‌ల‌స వెళ్ల‌వ‌ల‌సి వ‌స్తోందని ఆయన అన్నారు.

వాణిజ్య మైనింగ్‌ కు సంబంధించి తీసుకున్న చ‌ర్య‌లు తూర్పు, మ‌ధ్య భార‌తానికి ఎంతో ఉప‌యోగ‌ప‌డ‌తాయ‌ని , స్థానిక ప్ర‌జ‌ల‌ కు వారి నివాస ప్రాంతాల‌ సమీపంలోనే ఉపాధి దొరుకుతుంద‌ని ప్ర‌ధాన‌ మంత్రి అన్నారు. బొగ్గు వెలికితీత రంగం లో మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న‌, ర‌వాణా కు 50 వేల కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చుచేయాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించిన‌ట్టు ప్ర‌ధాన‌ మంత్రి చెప్పారు. ఇది కూడా ఉపాధి అవ‌కాశాలు క‌ల్పిస్తుంద‌ని ఆయ‌న తెలిపారు.

ఆదివాసీ ల జీవితాల‌ ను సుల‌భ‌త‌రం చేయ‌డం లో బొగ్గు రంగం లో సంస్క‌ర‌ణ‌ లు, పెట్టుబ‌డి కీల‌క పాత్ర ను వ‌హించ‌నున్న‌ట్టు ప్ర‌ధాన‌ మంత్రి వివ‌రించారు. బొగ్గు ఉత్ప‌త్తి ద్వారా వ‌చ్చిన అద‌న‌పు రాబ‌డి ని ఈ ప్రాంతం లో ప్ర‌జా సంక్షేమ ప‌థ‌కాల‌ కు వినియోగించ‌నున్న‌ట్టు తెలిపారు. జిల్లా ఖ‌నిజ నిధి నుండి రాష్ట్రాలు కూడా స‌హాయం పొందుతూ ఉంటాయ‌ని ఆయ‌న చెప్పారు. ఇందులో ఎక్కువ మొత్తాన్ని ప‌రిస‌ర ప్రాంతాల‌ లో అత్యావ‌శ్య‌క స‌దుపాయాల అభివృద్ధి కి వినియోగించ‌డం జ‌రుగుతుంద‌ని చెప్పారు.

ఆర్థిక వ్య‌వ‌స్థ సాధార‌ణ స్థితి కి తిరిగి వేగం గా చేరువవుతున్న ప్ర‌స్తుత ద‌శ‌ లో బొగ్గు వేలం ప్ర‌క్రియ చోటు చేసుకొంటోంద‌ని ప్ర‌ధాన‌ మంత్రి అన్నారు. బొగ్గు వినియోగం, డిమాండ్ లు శరవేగం గా కోవిడ్ కు పూర్వపు స్థాయి కి చేరుకొంటున్న‌ట్లు ఆయన తెలిపారు. డిమాండ్ వేగం గా కోవిడ్-19 కంటే ముందు స్థాయి కి చేరుకుంటున్న రంగాల ను గురించి ప్ర‌ధాన‌ మంత్రి ప్ర‌ముఖం గా ప్ర‌స్తావించారు. విద్యుత్తు వినియోగం తో పాటు పెట్రోల్ ఉత్ప‌త్తుల‌ కు గిరాకీ కూడా పెరుగుతోంద‌న్నారు. పుంజుకొంటున్న వాటిలో ఇ-వే బిల్స్, సుంకాల రూపం లో రాబ‌డి, రైల్వేల స‌ర‌కు ర‌వాణా పరిమాణం, డిజిట‌ల్ రీటైల్ లావాదేవీ లు ఉన్నాయ‌ని ప్రధాన మంత్రి అన్నారు.

గ్రామీణ ఆర్థిక వ్య‌వ‌స్థ కూడా మెరుగుప‌డ‌డం ప్రారంభ‌మైంద‌ని ప్ర‌ధాన‌ మంత్రి తెలిపారు. ఖ‌రీఫ్ సాగు కింద పంట విస్తీర్ణం, గోధుమ‌ల ప్రొక్యూర్‌మెంట్ ఈ ఏడాది పెరిగాయన్నారు. అంటే రైతు ల జేబుల‌ లోకి మ‌రింత మొత్తం వచ్చినట్లే అని ఆయ‌న అన్నారు. భార‌తదేశం యొక్క ఆర్థిక వ్య‌వ‌స్థ మళ్లీ పుంజుకొని ముందుకు సాగేందుకు సిద్దంగా ఉంది అని ప్ర‌ధాన‌ మంత్రి అన్నారు.

భారతదేశం ప్ర‌స్తుత సంక్షోభం నుండి గ‌ట్టెక్క‌గ‌ల‌ద‌న్న ఆకాంక్ష‌ ను ప్ర‌ధాన‌ మంత్రి వ్య‌క్తం చేశారు. గ‌తం లో ఇంత‌ కంటే పెద్ద సంక్షోభాన్ని దేశం అధిగ‌మించింద‌ని ఆయ‌న అన్నారు. భారతదేశం ఆత్మ‌నిర్భ‌ర్ కాగ‌ల‌ద‌న్న విశ్వాసాన్ని ప్ర‌ధాన‌ మంత్రి వ్యక్తం చేశారు. భార‌తదేశం యొక్క వృద్ధి, విజ‌యం త‌థ్య‌మ‌న్నారు. కొద్ది వారాల క్రితం మన దేశాని కి అవ‌స‌ర‌మైన ఎన్‌-95 మాస్క్‌ లు, క‌రోనా ప‌రీక్ష‌ల కిట్ లు పిపిఇ లు, వెంటిలేట‌ర్ లు వంటి వాటి ని దిగుమ‌తుల ద్వారా స‌మీక‌రించుకొనే వార‌మ‌ని, అయితే ప్ర‌స్తుతం వీటి ని ‘మేక్ ఇన్ ఇండియా’ ద్వారా స‌మ‌కూర్చుకొంటున్నామ‌ంటూ ప్ర‌ధాన‌ మంత్రి దేశ విజ‌య ప‌థాన్ని గురించి వివరించారు. త్వ‌ర‌లోనే మ‌నం వైద్య ఉత్ప‌త్తుల‌ కు సంబంధించి ప్ర‌ధాన ఎగుమ‌తిదారు దేశం గా మార‌బోతున్నామ‌న్నారు. మ‌నం ఆత్మ‌నిర్భ‌ర‌ భార‌త్ ను ఆవిష్కరించగలిగేలా ఆత్మ‌విశ్వాసాన్ని, ధైర్యాన్ని నిలుపుకోవలసింది గా ప్రజల ను ప్ర‌ధాన‌ మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అభ్యర్థించారు.

**