నైపుణ్యాభివృద్ధికి, ప్రధాన కెరీర్ మార్గంగా నైపుణ్యాలను మార్చడానికి భారత్ ఇస్తున్న ప్రాధాన్యం గురించి కేంద్ర సహాయ మంత్రి శ్రీ జయంత్ చౌధరి రాసిన కథనాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు.
త్వరలో జరగబోయే వరల్డ్ స్కిల్స్ ఆసియా-2027 గురించి, ఐటీఐలను ఆధునికీకరించే పీఎం-సేతు కార్యక్రమం గురించి, పారిశ్రామిక అనుసంధానంతో కూడిన శిక్షణను బలోపేతం చేసే ప్రయత్నాల గురించి శ్రీ జయంత్ చౌధరి తెలియజేశారు. ఈ కార్యక్రమాలు ఏఐ యుగంలో పుట్టుకొస్తున్న నూతన అవకాశాలకు తగిన విధంగా యువతను ఎలా సన్నద్ధం చేస్తున్నాయో వివరించారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి కార్యాలయం పోస్టు:
‘‘తన నైపుణ్య ప్రయాణాన్ని ప్రపంచ వేదికపైకి భారత్ తీసుకెళుతోంది!
నైపుణ్యాభివృద్ధికి, ప్రధాన కెరీర్ మార్గంగా నైపుణ్యాలను మార్చేందుకు దేశం ఇస్తున్న ప్రాధాన్యం గురించి కేంద్ర సహాయ మంత్రి శ్రీ @jayantrld రాశారు. త్వరలో జరగబోయే వరల్డ్ స్కిల్స్ ఆసియా-2027, ఐటీఐలను మెరుగుపరిచేందుకు అమలు చేస్తున్న పీఎం-సేతు, పారిశ్రామిక అనుసంధానంతో కూడిన శిక్షణను బలోపేతం చేసే ప్రయత్నాల గురించి ఆయన తెలియజేశారు. అలాగే ఏఐ యుగంలో లభిస్తున్న అవకాశాలకు అనుగుణంగా ఈ కార్యక్రమాలు యువతను ఎలా సన్నద్ధం చేస్తున్నాయో కూడా వివరించారు.’’
***
India is taking its skilling journey to the world stage! Union MoS Shri @jayantrld writes about the country's growing focus on skill development and the importance of making skilling a preferred career pathway. He highlights the upcoming WorldSkills Asia 2027, the PM-SETU initiative to upgrade ITIs and efforts to strengthen industry-linked training. He also reflects on how these initiatives are preparing youth for emerging opportunities in the age of AI.
— PMO India (@PMOIndia) November 24, 2026