పిఎంఇండియా
వస్త్రాలు, దుస్తుల రంగంలో ఉపాధి కల్పన మరియు ఎగుమతుల ప్రోత్సాహానికి ఉద్దేశించిన ప్రత్యేక ప్యాకేజికి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశానికి అధ్యక్షత వహించారు.
రానున్న మూడు సంవత్సరాల కాలంలో వస్త్రాలు, దుస్తుల రంగంలో ఒక కోటి ఉద్యోగాల కల్పనకు ప్రభుత్వం సంస్కరణలను ప్రకటించిన నేపథ్యంలో ప్రభుత్వం తాజా నిర్ణయాన్ని తీసుకొంది. ఈ ప్యాకేజిలో కార్మికులకు మేలు కలిగించే చర్యలు, ఉపాధి కల్పనతో పాటు పెద్ద ఎత్తున కార్యకలాపాలు జరగడం వల్ల ఒనగూరే ప్రయోజనాలతో పాటు ఎగుమతులకు ప్రోత్సాహం లభించే చర్యలు కలసి ఉన్నాయి. రానున్న మూడు సంవత్సరాలలో ఈ చర్యల వల్ల ఎగుమతులలో మొత్తంమీద 30 బిలియన్ యు ఎస్ డాలర్ల పెరుగుదల, రూ.74,000 కోట్ల పెట్టుబడులు సమకూరగలవు.
కొత్త ఉద్యోగాలలో ఎక్కువ భాగం మహిళలకు దక్కే అవకాశం ఉంది. దుస్తుల పరిశ్రమలో పని చేసే వారిలో దాదాపు 70 శాతం మంది మహిశా కార్మికులే ఉండడమే దీనికి ఒక ప్రధానమైన కారణం. ఈ రకంగా ఈ ప్యాకేజి మహిళా సాధికారతకు దోహదపడడం ద్వారా సామాజిక పరివర్తనను తీసుకురావడంలోనూ సహాయకారి కాగలదు.
ఈ ప్యాకేజి ప్రధానాంశాలు :
ఎ. ఉద్యోగుల భవిష్య నిధి పథకంలో సంస్కరణలు
– దుస్తుల పరిశ్రమలో చేరే కొత్త ఉద్యోగులలో నెలకు రూ.15,000 లోపు సంపాదన ఉన్న వారికి 3 సంవత్సరాల పాటు యాజమాన్యం చెల్లించాల్సిన 12 శాతం యాజమాన్య భవిష్య నిధి వాటాను కేంద్ర ప్రభుత్వం భరించనుంది.
– ప్రస్తుతం యాజమాన్యం చెల్లించాల్సిన 8.33 శాతం వాటాను ప్రధాన మంత్రి రోజ్ గార్ ప్రోత్సాహన్ యోజన ( పి ఎమ్ ఆర్ పి వై ) కింద ప్రభుత్వం ఇప్పటికే సమకూరుస్తోంది. యాజమాన్యం వాటాలో మరొక 3.67 శాతం వాటాను జౌళి మంత్రిత్వ శాఖ చెల్లిస్తోంది. రానున్న మూడు సంవత్సరాలలో ఇది రూ.1,170 కోట్ల మేరకు ఉండవచ్చు.
– నెలకు రూ.15,000 కన్నా తక్కువ ఆర్జించే ఉద్యోగులకు ఇ పి ఎఫ్ ను ఐచ్ఛికం చేస్తారు.
– ఇది శ్రామికుల చేతిలో మరింత డబ్బు మిగిలేటట్లు చేయగలదు. సాంప్రదాయక రంగంలో ఉపాధికి ప్రోత్సాహం లభిస్తుంది కూడాను.
బి. ఓవర్ టైమ్ పరిమితుల పెంపు
– ఐ ఎల్ ఒ నిబంధనలకు అనుగుణంగా శ్రామికులకు ఓవర్ టైమ్ వారానికి 8 గంటలు మించకూడదు.
– ఇది శ్రామికుల ఆర్జన పెరగడానికి దారి తీయగలదు.
సి. స్థిర కాల ఉపాధిని ప్రవేశపెట్టడం
– పరిశ్రమకున్న సీజనల్ స్వభావం దృష్ట్యా దుస్తుల రంగానికి స్థిర కాల ఉపాధిని ప్రవేశపెట్టనున్నారు.
– పని వేళలు, వేతనాలు, భత్యా లు, చట్టపరంగా అందాల్సిన ఇతర పరిహారాల విషయంలో స్థిర కాల ఉపాధిని పొందిన శ్రామికులను పర్మనెంట్ శ్రామికులతో సమానంగా పరిగణిస్తారు.
డి. ఎ టి యు ఎఫ్ ఎస్ లో భాగంగా అదనపు ప్రోత్సాహకాలు
– ముడిసరకు ఆధారంగా ఇచ్చే ప్రోత్సాహకాలకు బదులు ఈ ప్యాకేజిలో భాగంగా ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల విధానాన్ని ప్రవేశపెడుతున్నారు. ఉపాధి కల్పనకు మరింత ఉత్తేజం ఇచ్చే లక్ష్యంతో సవరించిన టి యు ఎఫ్ ఎస్ కింద సబ్సిడీని 15 శాతం నుండి 25 శాతానికి పెంచుతారు.
– నిర్దేశిత సంఖ్యలో ఉద్యోగాలు కల్పించిన తరువాత మాత్రమే సబ్సిడీని అందించడం ఈ పథకం ప్రధాన లక్షణం.
ఇ. పెంచిన డ్యూటీ డ్రాబ్యాక్ కవరేజి
– ఈ పరిశ్రమ చరిత్రలోనే తొలిసారిగా ప్రభుత్వ లెవీలను వాపసు చేసే విధానం ప్రవేశపెట్టారు.
– ఈ చర్య వల్ల ప్రభుత్వ ఖజానాపై రూ.5,500 కోట్ల వరకు భారం పడొచ్చని భావిస్తున్నారు. అయితే విదేశీ మార్కెట్లలో భారత ఎగుమతుల పోటీ సామర్థ్యం మాత్రం గొప్పగా మెరుగుపడగలదు.
– అడ్వాన్స్ ఆథరైజేషన్ స్కీమ్ కింద ఫేబ్రిక్స్ దిగుమతి చేసుకుంటే దేశీయంగా చెల్లించిన సుంకాలకు ఇతర పరిశ్రమలకు అందిస్తున్న రేట్లకు సమానంగా డ్రాబ్యాక్ వర్తింపచేస్తారు.
ఎఫ్. ఆదాయపు పన్ను చట్టంలోని 80 జెజెఎఎ సెక్షన్ పరిధి విస్తరణ
– గార్మెంట్ పరిశ్రమ సీజనల్ స్వభావాన్ని బట్టి ఆదాయపు పన్ను చట్టం 80జెజెఎఎ సెక్షన్ కింద కల్పించాల్సిన ఏడాదిలో 240 రోజుల ఉపాధి నిబంధనను 150 రోజులకు తగ్గించారు.
PPT on Textile and Apparel Sector Reform Package :
సంస్కరణల ప్యాకేజి కోసం టెక్స్ టైల్, అపారెల్ విభాగంలో సంస్కరణల పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ను చూడవచ్చు:
Special package approved by the Cabinet today pertaining to textile & apparel sector will boost youth employment, manufacturing & exports.
— Narendra Modi (@narendramodi) June 22, 2016
Farmers have a very strong link with the textile sector. The package will further lead to value addition of agro products & help farmers.
— Narendra Modi (@narendramodi) June 22, 2016
The package is labour friendly & women will greatly benefit from it. It is a step for #TransformingIndia. https://t.co/rGF9BClFEw
— Narendra Modi (@narendramodi) June 22, 2016