పిఎంఇండియా
నేపాల్ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ బాలేంద్ర షా కి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ‘‘మీరు ఈ పదవీ బాధ్యతలు చేపట్టడం, మీ నాయకత్వంపై నేపాల్ ప్రజలు ఉంచిన నమ్మకానికి నిదర్శనం’’అని శ్రీ మోదీ పేర్కొన్నారు. భారత్, నేపాల్ దేశాల మధ్య ఉన్న స్నేహం, సహకారం కొత్త శిఖరాలకు చేరుకుంటుందని, ఇది ఇరు దేశాల ప్రజల పరస్పర ప్రయోజనాలకు దోహదపడుతుందని తాను విశ్వసిస్తున్నట్లు ప్రధాని శ్రీ మోదీ స్పష్టం చేశారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి ఈ విధంగా పేర్కొన్నారు.
‘‘నేపాల్ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన బాలేంద్ర షా గారికి హృదయపూర్వక అభినందనలు!
మీరు ఈ పదవీ బాధ్యతలు స్వీకరించడం మీ నాయకత్వంపై నేపాల్ ప్రజలు ఉంచిన విశ్వాసానికి నిదర్శనం. ఇరు దేశాల ప్రజల పరస్పర ప్రయోజనాల దృష్ట్యా మనం కలిసి భారత్-నేపాల్ స్నేహాన్ని, సహకారాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్తామని నాకు విశ్వాసం ఉంది’’.
***
नेपाल के प्रधानमंत्री पद की शपथ लेने पर बालेंद्र शाह जी को हार्दिक बधाई!
— Narendra Modi (@narendramodi) March 27, 2026
आपका कार्यभार संभालना नेपाल की जनता द्वारा आपके नेतृत्व में भरोसे को जताता है। मुझे विश्वास है कि हम मिलकर भारत-नेपाल की मित्रता और सहयोग को एक नई ऊंचाई पर ले जाएंगे, जो दोनों देशों के लोगों के पारस्परिक…