పిఎంఇండియా
అధ్యక్షుడు హోలెండ్, వరిష్ఠులు, పారిశ్రామిక నేతల్లారా..
ఫ్రాన్స్ ప్రజలకు మరోమారు మా పూర్తి సంఘీభావాన్ని తెలియజేస్తున్నాను. అత్యంత క్లిష్టమైన ఈ పరిస్థితుల్లో కూడా ప్రపంచానికి అద్భుతమైన ఆతిథ్యమిస్తున్నందుకు మీపట్ల మనసు పులకరించిపోతోంది. సౌరశక్తి యుత దేశాల అంతర్జాతీయ సౌర కూటమి నా చిరకాల వాంఛ. అది చెప్పగానే అధ్యక్షుడు హోలెండ్ అత్యంత ఆసక్తితో ఎంతో వేగంగా స్పందించి, పూర్తి మద్దతును ప్రకటించారు. వాతావరణ మార్పులపై ప్రపంచ దృక్పథాన్ని మారుస్తున్న అత్యంత కీలక సదస్సు ఆరంభ దినోత్సవమిది. ప్రతి దశలోనూ ఆయ అందించిన మద్దతుకు, ఈ కూటమి ఆవిష్కారంలో తోడుగా నిలిచినందుకు మనఃపూర్వక కృతజ్ఞతలు. ప్రకృతిపై కొటేషన్ల పుస్తకానికి ఆయనతో కలసి ముందుమాట రాయటం నిజంగా గౌరవంగా భావిస్తున్నాను. పురాతన కాలం నుంచీ వివిధ సమాజాలు, సంస్కృతులు సూర్యుడికి ప్రత్యేక స్థానాన్ని ఇచ్చాయి. భారతీయ సమాజ సంస్కృతిలో అన్నివిధాలైన శక్తికీ సూర్యుడే మూలాధారం. రుగ్వేదంలో చెప్పినట్లు జీవ, నిర్జీవ సకల చరాచరాల ఆత్మ సూర్యుడే. భారత్‌లో చాలా మంది దినచర్య సూర్యుడిని ప్రార్థించటంతోనే ఆరంభమవుతుంది. ఇంధన వనరులు, పారిశ్రామిక వ్యర్థాల కారణంగా ప్రపంచం కష్టాలను ఎదుర్కొంటున్న ప్రస్తుత తరుణంలో.. భవిష్యత్తులో ఇంధనం కోసం ప్రపంచమంతా సూర్యుడిపై ఆధారపడాల్సిందే. కోట్లాది మంది ప్రజల శ్రేయస్సు లక్ష్యంగా వర్ధమాన దేశాలు ముందుకు సాగుతున్న వేళ, ప్రపంచమంతా కలసి ప్రతిన బూనితేనే మన భూగోళం సుస్థిరంగా ఉంటుంది. అంటే వర్ధమానదేశాలకు ఎదగటానికి సరైన కార్బన్ స్పేస్‌ను అభివృద్ధి చెందిన దేశాలు అందించాలి. ఇది వాతావరణ సహజ న్యాయం. తక్కువ కార్బన్ ఉత్పాదకాలతో అభివృద్ధి చెందేందుకు దారి అవుతుందిది. ఆర్థికం, పర్యావరణం, ఇంధనాల మధ్య సమన్వయ సాధనే మన భవిష్యత్‌ను నిర్వచిస్తుంది.
ప్రపంచ మానవాళిలో అత్యధిక శాతం మందికి ఏడాదంతా సూర్యరశ్మి అందుబాటులో ఉంటుంది. అయినా చాలా మందికి విద్యుత్ లేదు. అందుకే ఈ సౌర కూటమి కీలకం కాబోతోంది. సౌర ఇంధనాన్ని సుస్థిరంగా, సులభంగా గ్రిడ్‌కు అనుసంధానించి మరింత చౌకగా మన జీవితాల్లోకి, ఇళ్ళలోకి తీసుకురావాలన్నది మా కోరిక. పరిశోధన, సృజనాత్మక ఆవిష్కరణల్లో సహాయం చేసుకుంటాం. ఒకరి మంచి పద్ధతులను మరొకరు, ఒకరి పరిజ్ఞానాన్ని మరొకరం ఇచ్చి పుచ్చుకుంటాం. శిక్షణలో, వ్యవస్థలు, సంస్థల ఏర్పాటులో సహకరించుకుంటూ, ఎప్పకప్పుడు ప్రమాణాలను పెంచుకుంటుంటాం. సౌరరంగంలో పెట్టుబడులను పెంచి, సంయుక్త భాగస్వామ్యాలను, వినూత్న పెట్టుబడి యంత్రాంగాలను ప్రోత్సహిస్తాం. సంప్రదాయేతర ఇంధనం విషయంలో అంతర్జాతీయ యత్నాలతో కలసి నడుస్తాం. సౌర ఇంధనంలో ఇప్పటికే విప్లవం మొదలైంది. సాంకేతికత రోజురోజుకూ అభివృద్ధి చెందుతోంది. ధరలు తగ్గుతున్నాయి. గ్రిడ్ అనుసంధానం మెరుగుపడుతోంది. స్వచ్ఛ ఇంధనం అందించాలన్న అంతర్జాతీయ కల నిజం కాబోతోంది. భారత్‌కు 4 జీడబ్ల్యూ సామర్థ్యముంది. 2022 కల్లా మరో 100 జీడబ్ల్యూ ల సౌరశక్తిని లక్ష్యంగా పెట్టుకున్నాం. వచ్చే ఏడాది పూర్తయ్యే సరికల్లా మరో 12 జీడబ్ల్యూల సౌరశక్తి అదనంగా సాధిస్తాం. పారిశ్రామిక రంగం స్పందన నాకెంతో ఆనందం కలిగిస్తోంది. స్వచ్ఛ ఇంధనం అందరికీ అందుబాటులో ఉంటే అపరిమితమైన ఆర్థిక అవకాశాలు పుట్టుకొస్తాయి. ఈ దేశంలో కొత్త ఆర్థిక పునాదులకు అది దారి తీస్తుంది. వర్ధమాన దేశాలు, అభివృద్ధి చెందిన దేశాలను, ప్రభుత్వాలను, పరిశ్రమలను, ప్రయోగశాలలను, సంస్థలను ఒకచోటికి తెస్తోంది ఈ సౌర కూటమి.
Launch of International Solar Alliance fulfils a long cherished dream. President @fhollande's interest & support has been vital. @COP21
— Narendra Modi (@narendramodi) November 30, 2015
My deepest gratitude to all world leaders who joined launch of International Solar Alliance. Mr. Ban Ki-moon made insightful points. #COP21
— Narendra Modi (@narendramodi) November 30, 2015
International Solar Alliance brings together developed & developing nations, govts. & industries, labs & institutions in a common enterprise
— Narendra Modi (@narendramodi) November 30, 2015
My message to the world- let us turn to the Sun to power our future. https://t.co/IEvPZglKGj
— Narendra Modi (@narendramodi) November 30, 2015
My message to the world- let us turn to the Sun to power our future. https://t.co/IEvPZglKGj
— Narendra Modi (@narendramodi) November 30, 2015
Since ancient times different civilizations have given a special place to Sun: PM @narendramodi #COP21 @COP21en @India4Climate
— PMO India (@PMOIndia) November 30, 2015
In the Indian tradition Sun is the source of all forms of energy: PM @narendramodi at #COP21 @India4Climate https://t.co/rxjyNOkteX
— PMO India (@PMOIndia) November 30, 2015
In the Indian tradition Sun is the source of all forms of energy: PM @narendramodi at #COP21 @India4Climate https://t.co/rxjyNOkteX
— PMO India (@PMOIndia) November 30, 2015
Convergence between economy, ecology and energy should define our future: PM @narendramodi
— PMO India (@PMOIndia) November 30, 2015
India has capacity of 4GW & we have set a target of adding 100 GW of solar power by 2022: PM @narendramodi at @COP21 @COP21en @India4Climate
— PMO India (@PMOIndia) November 30, 2015
This day is the sunrise of new hope – not just for clean energy, but for villages and homes still in darkness: PM @narendramodi
— PMO India (@PMOIndia) November 30, 2015