పిఎంఇండియా
ఆసియా కప్ హాకీ డిఫెండింగ్ చాంపియన్‌గా ఆ ట్రోఫీని నిలబెట్టుకున్న భారత మహిళల జూనియర్ జట్టును ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు. అద్భుత ప్రతిభాపాటవాలతో ఈ జట్టు ఎంత అజేయమైనదో నిరూపించారని ఆయన కొనియాడారు.
ఈ విజయం మన క్రీడాకారిణుల దృఢ సంకల్పానికి, తిరుగులేని నైపుణ్యానికి నిదర్శనమని ప్రధానమంత్రి పేర్కొంటూ జట్టుకు, వారికి తోడ్పడిన ఇతర సిబ్బందికీ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ ద్వారా పంపిన సందేశంలో:
“భారత హాకీకి ఈ విజయం అత్యంత ముదావహం! అద్భుత, అజేయ ప్రతిభా ప్రదర్శనతో ఆసియా కప్‌ను నిలబెట్టుకున్న మన జూనియర్ మహిళా హాకీ జట్టుకు నా అభినందనలు. ఈ అప్రతిహత విజయం మన క్రీడాకారిణుల దృఢ సంకల్పానికి, నైపుణ్యానికి నిదర్శనం. ఈ సందర్భంగా జట్టు మొత్తానికీ నా హర్దిక శుభాకాంక్షలు!” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
@TheHockeyIndia”
A proud moment for Indian hockey!
— Narendra Modi (@narendramodi) September 13, 2026
Congratulations to our Junior Women’s Hockey Team on retaining the Asia Cup with a superb unbeaten campaign.
Their success reflects the talent and determination of the players.
Best wishes to the entire team!@TheHockeyIndia pic.twitter.com/Z5pYVSYYWN