Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఆసియా కప్ గెలిచిన భారత మహిళల క్రికెట్ జట్టుకు ప్రధానమంత్రి అభినందనలు


   ఆసియా కప్‌ మహిళల క్రికెట్‌ కప్‌ విజేతగా నిలిచిన భారత జట్టును ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు. ఈ పోటీలో జట్టు ఆత్మవిశ్వాసం, నిలకడ, అద్భుత స్ఫూర్తి ఆద్యంతం సంపూర్ణంగా ప్రస్ఫుటమయ్యాయని ఆయన హర్షం వ్యక్తం చేశారు.

దేశంలోని లక్షలాది యువతను మరింత స్ఫూర్తితో క్రీడల్లో రాణించడానికి ఈ విజయం ఎంతగానో దోహదం చేయగలదని శ్రీ మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’ ద్వారా పంపిన సందేశంలో:

“భారత క్రికెట్‌కు ఇదొక మధుర క్షణం! ఆసియా కప్‌ కైవసం చేసుకున్న మహిళల జట్టుకు నా అభినందనలు. ఈ టోర్నమెంటులో ఆదినుంచీ వారి ఆత్మవిశ్వాసం, నిలకడ, ఎనలేని స్ఫూర్తి పూర్తిస్థాయిలో ప్రదర్శితమయ్యాయి. దేశంలోని లక్షలాది యువత క్రీడలలో మరింత రాణించడానికి ఈ విజయం స్ఫూర్తినివ్వాలని ఆకాంక్షిస్తున్నాను” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.