పిఎంఇండియా
ఆసియా క్రీడల్లో పురుషుల లాంగ్ జంప్‌లో పతకం సాధించిన మురళీ శ్రీశంకర్ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.
శ్రీశంకర్ సాధించిన అద్భుతమైన జంప్ ఆయనకు సముచిత స్థానాన్ని అందించిందని ప్రధాని అన్నారు. శ్రీశంకర్‌కు అభినందనలు తెలియజేస్తూ, అతడు భవిష్యత్తులో మరెన్నో విజయాలు సాధించాలని శ్రీ మోదీ ఆకాంక్షించారు.
“మురళీ శ్రీ శంకర్‌కు మరో ఆసియా క్రీడల పతకం! పురుషుల లాంగ్ జంప్‌లో ఆయన చేసిన అద్భుతమైన జంప్ ఆయనకు పతాకాన్ని అందించింది. ఆయనకు అభినందనలు. భవిష్యత్తులో ఆయన మరెన్నో విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాను” అని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్‘ లో పేర్కొన్నారు.
***
Another Asian Games medal for Murali Sreeshankar!
— PMO India (@PMOIndia) September 28, 2026
His leap earned him a place on the Men’s Long Jump podium.
Congratulations to him. Wishing him many more successes ahead: PM @narendramodi