Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఇంధన భద్రతపై భారత్-ఆస్ట్రేలియా సంయుక్త ప్రకటన


భారత్ఆస్ట్రేలియాలు సమగ్ర వ్యూహాత్మక భాగస్వాములుగా ఉన్నాయి. స్వేచ్ఛాబహిరంగసమృద్ధి ప్రధాన ఇండో-పసిఫిక్ ప్రాంతం విషయంలో ఈ రెండు దేశాలూ ఒకే దృష్టికోణాన్ని కలిగి ఉన్నాయి.

మధ్య ప్రాచ్య ప్రాంతంలోని ప్రస్తుత స్థితిమన ప్రాంతంపై అది ప్రసరించే ప్రభావాల విషయంలో.. మరీ ముఖ్యంగా ఇంధనంవనరులుఇతర ముఖ్య సరకుల సరఫరా వ్యవస్థలతో పాటు ధరలపై దీర్ఘ కాలం పాటు పడే ప్రభావాల పట్ల భారత్ఆస్ట్రేలియా తీవ్ర ఆందోళనను వ్యక్తం చేస్తున్నాయిఈ అంతరాయం నడుమ.. బహిరంగ మార్కెట్లునియమాలపై ఆధారపడి వాణిజ్య నిర్వహణ పట్ల మనం మన ఉమ్మడి నిబద్ధతను పునరుద్ఘాటిస్తున్నాం. ఈ సూత్రాలే మన సౌభాగ్యానికిఆర్థిక భద్రతకి మూలాధారాలుగా నిలుస్తున్నాయి.

సుస్థిరవిశ్వసనీయ ఇంధన సరఫరాలకు నమ్మదగిన ప్రయివేటు రంగ భాగస్వామ్యాలువ్యూహాత్మక పెట్టుబడులు కీలక పాత్రను పోషిస్తున్నాయని భారత్ఆస్ట్రేలియా గుర్తిస్తున్నాయి. దీనికి సమాంతరంగాప్రయివేటు రంగ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికిఆర్థిక సహకారంవాణిజ్య ఒప్పందాన్ని (ఈసీటీఏకుదుర్చుకోవడంతో పాటు సమగ్ర ఆర్థిక సహకార ఒప్పందాన్ని (సీఈసీఏ) కూడా కుదుర్చుకోవడానికీ రెండు దేశాలూ కట్టుబడి ఉన్నాయి. అలాగే ఇతర సముచిత ద్వైపాక్షిక ప్రాథమిక ప్రణాళికలను ఖరారు చేసుకొని ఇంధన వాణిజ్యపెట్టుబడుల సంబంధిత సహకారాన్ని ముందుకు తీసుకుపోవాలన్న నిబద్ధతను ఉభయ పక్షాలూ వ్యక్తం చేశాయి. ఇంధన రంగంలో సామర్థ్యాలను పెంచుకుంటూజ్ఞానాన్ని పంచుకోవడానికి ప్రాధాన్యాన్ని ఇవ్వాల్సి ఉందన్న సంగతిని కూడా భారత్ఆస్ట్రేలియా ఈ సందర్భంగా పునరుద్ఘాటిస్తున్నాయి.

ద్రవీకృత సహజ వాయువు ముఖ్య సరఫరాదారు దేశంగా ఆస్ట్రేలియా పోషిస్తున్న పాత్రతో పాటుద్రవరూప ఇంధనాలుఇతర డౌన్‌స్ట్రీమ్ ఉత్పాదనల కీలక సరఫరాదారు దేశంగా భారత్ పోసిస్తున్న పాత్రను కూడా ఉభయ పక్షాలు గుర్తించాయి. ఇంధన ఉత్పాదనల నిరంతర సరఫరాను భారత్ ఆస్ట్రేలియా సమర్ధించడమే కాకుండా తమ రెండు దేశాల మధ్యా ఇంధన వాణిజ్యాన్ని మరింతగా పెంచుకోవడానికి కట్టుబడి ఉన్నాయి. ఇంధన వేల్యూ చైన్లో పెట్టుబడి పెట్టడానికి ఉన్న అవకాశాలను ప్రోత్సహించాల్సి ఉందని భారత్ఆస్ట్రేలియా మరో సారి స్పష్టం చేస్తున్నాయి. ఆస్ట్రేలియా-భారత్ పరమాణు సహకార ఒప్పందం (2015)లో ప్రస్తావించినట్లుగా కేవలం శాంతియుత ఉద్దేశాల కోసంఅలాగే అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ (ఐఏఈఏ) నిర్దేశించిన భద్రత విధానాలను అనుసరిస్తూ ఆస్ట్రేలియాకు చెందిన యురేనియంను భారత్‌కు ఎగుమతి చేయడానికి అవసరమైన పాలనాసంబంధమైన ఏర్పాట్లను భారత్ఆస్ట్రేలియా ఖరారు చేసుకున్నాయి.

ప్రాంతీయ సహకారాన్ని విస్తరించుకోవడంఇంధన వినియోగంలో మార్పు దిశగా వేగంగా పురోగమించడంఇంధనంతో పాటు ద్రవరూప ఇంధనం కోసం బహిరంగ వాణిజ్య ఒప్పందాలను ప్రోత్సహించడం సహా ఇంధన సరఫరా వ్యవస్థ సుదృఢత్వాన్ని మరింత పటిష్ఠపరచడానికి కలిసి పనిచేయడానికి భారత్ఆస్ట్రేలియా కట్టుబడి ఉన్నాయి. సంబంధిత ఇంధన వ్యవస్థల్లో విద్యుదీకరణ ప్రక్రియకు ఇవ్వాల్సిన ప్రాధాన్యాన్ని విస్తరించడం రాబోయే కాలంలో ఇంధన భద్రత పరంగా కీలకం కాగలదని ఇరు దేశాలూ గుర్తించాయి.

సుదృఢ వాణిజ్యంమార్కెట్లు… ఈ రెండు విషయాల్లో ఉమ్మడి నిబద్ధతను భారత్ఆస్ట్రేలియా గుర్తిస్తున్నాయి. ఇది ఇంధన రంగానికీ వర్తిస్తుంది. పసిఫిక్ ఐలాండ్ దేశాల పరంగా చూసినప్పుడు ఇంధన వనరుల భద్రతకు సంబంధించి నిర్దిష్ట బలహీనతలపైనాఆయా దేశాల సుదృఢత్వానికిఆర్థిక సమృద్ధికి ఇంధన వనరుల సరఫరా ఎంత ముఖ్యమో అన్న సంగతిపైనా ఇరు దేశాలకూ అవగాహన ఉంది.  

ఈ నేపథ్యంలో ఇంధన భద్రతను బలోపేతం చేసుకోవడానికి కలిసి పనిచేయాలనే తమ నిబద్ధతను భారత్ఆస్ట్రేలియా పునరుద్ఘాటిస్తున్నాయి. బొగ్గుడీజిలుఇతర ద్రవరూప ఇంధనాలతో పాటు సహజ వాయువు వంటి ఇంధన సంబంధిత ఉత్పాదనలకు సుస్థిరసురక్షితవిశ్వసనీయ సరఫరా వ్యవస్థను సంరక్షించుకోవడం ఈ విషయంలో భాగంగా ఉంది. దీనికి తోడుఇంధన వినియోగంలో మార్పు దిశగా పయనించడాన్ని వేగవంతం చేయాలనితక్కువ కర్బనాన్ని కలిగి ఉండే ఇంధనాల విషయంలో సహకరించుకోవడాన్ని పెంపొందించాలన్న తమ నిబద్ధతను రెండు దేశాలూ పునరుద్ఘాటించాయి సందర్భంగానే గ్లోబల్ బయోఫ్యూయల్స్ అలయెన్స్ (జీబీఏ) కార్యక్రమాన్ని భారత్ తీసుకువచ్చిందని ఆస్ట్రేలియా గమనించింది.

ప్రజల భద్రతనిసౌభాగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని అంతర్జాతీయ ఇంధన వనరుల సరఫరా వ్యవస్థలను తెరిచి ఉంచే దిశగా సహకారాన్ని అందించాలంటూ ప్రాంతీయ భాగస్వామ్య దేశాలకు భారత్ఆస్ట్రేలియా పిలుపునిచ్చాయి.

***