Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఈశాన్య రాష్ట్రాల లోని అభివృద్ధి పథకాలకు మరిన్ని ప్రోత్సాహకాలు


నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్ (ఎన్ఇసి) నిర్వహిస్తున్న పథకాలను కొనసాగిస్తూనే కొత్త పథకాలకు మంత్రివర్గం తన ఆమోదాన్ని తెలిపింది. రూ.4,500 కోట్ల విలువైన ఈ పథకాలను మూడు సంవత్సరాల పాటు, అంటే 2020 సంవత్సరం మార్చి నెల వరకు అమలు చేయాలని నిర్ణయించింది. 100 శాతం గ్రాంటు కింద ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి నిధులను అందించాలని, అందులో భాగంగా ఎన్ఇసి- ప్రత్యేక అభివృద్ధి పథకం కోసం ఎన్ ఎల్ సిపిఆర్ నిధులను బదిలీ చేయాలని నిర్ణయించింది. ఎన్ఇసి స్వయంగా ఈ నిధులను ఖర్చు చేయవలసివుంటుంది.

ఈశాన్య ప్రాంతాల అభివృద్ధి మంత్రిత్వ శాఖ (M/o DONER) ప్రతిపాదించిన దిగువ పథకాలకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం తన ఆమోదాన్ని తెలిపింది. ఆయా పథకాలకు 2020 సంవత్సరం మార్చి నెలను కాలావధిగా పేర్కొంది.

• ఎన్ఇసి పథకాలలో.. ప్రత్యేక అభివృద్ధి పథకాల కింద ప్రస్తుతం 90:10 నిష్పత్తి లో అమలవుతున్న పథకాలు.. కొత్త పథకాలకు 100 శాతం నిధులు..

• 100 శాతం కేంద్ర నిధులతో అమలవుతున్న ఎన్ఈసీ ఆదాయ, పెట్టుబడి పథకాలు.

• ఈశాన్య రాష్ట్రాలలో రహదారి పథకాల (ఈశాన్య రహదారుల అభివృద్ధి పథకం) విస్తరణ.

• మురిగిపోని కేంద్రీకృత వనరుల నిధి ని ఎన్ఇసి కి బదిలీ చేయడం.

• వివిధ మంత్రిత్వ శాఖల, విభాగాల ప్రయత్నాలను సమీకృతం చేయడం ద్వారా వనరులను సమగ్రంగా వినియోగించుకోవడం.

ఎన్ఇసి అమలు చేస్తున్న అనేక అభివృద్ధి పథకాల్లో మురిగిపోని కేంద్రీకృత వనరుల నిధి (ఎన్ ఎల్ సిపిఆర్) పథకం, ఈశాన్య ప్రాంత రహదారుల అభివృద్ధి పథకం (ఎన్ఇఆర్ డిఎస్) వల్ల ఈశాన్య ప్రాంతంలో సామాజిక, ఆర్థిక ప్రయోజనాలు ఒనగూరుతాయి. వీటి వల్ల ప్రజల సామర్ధ్యాలు, జీవన విధానాలు మరింతగా మెరుగవుతాయి.

ప్రస్తుతం అమలవుతున్న పథకాలలో (840 పథకాలలో 599) 72.12 శాతం ఆమోదిత వ్యయాన్ని (7453.02 కోట్ల రూపాయలలో 5375.12 కోట్ల రూపాయలు) ఈశాన్య ప్రాంత పథకాలు- ప్రత్యేక అభివృద్ధి పథకం కింద అందిస్తారు. ప్రస్తుతం బకాయి ఉన్న 66 శాతాన్ని అంటే 1518.64 కోట్ల రూపాయలను (మొత్తం 2299.72 కోట్ల రూపాయలలో) కూడా ఈ ప్రత్యేక అభివృద్ధి పథకం ద్వారా అందిస్తారు. ఈ ప్రత్యేక అభివృద్ధి పథకంలో భాగంగా అమలు చేస్తున్న పథకాల ఖర్చు ను ఇప్పటి వరకు కేంద్రం, రాష్ట్రాలు 90:10 నిష్పత్తిలో భరిస్తున్నాయి. పథకాల అమలు బాధ్యత ఆయా రాష్ట్ర ప్రభుత్వాల దగ్గరే ఉంది.. ఆదాయం లేదా పెట్టుబడి తరహా లో కూడా కొన్ని నిధులను అందిస్తున్నారు. ఇవి 100 శాతం కేంద్ర పథకాలు గానే ఉంటాయి; కానీ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఈ పనులను అమలుపరుస్తాయి.

ఎన్ఇసి- స్పెషల్ డివెలప్ మెంట్ ప్రాజెక్టు ఇక నుండి పూర్తిగా కేంద్రం పరిధిలో అమలయ్యే పథకం గా పరిగణిస్తారు. దీనికి 100 శాతం నిధులను కేంద్రమే అందిస్తుంది. అంటే 90:10 శాతం నిష్పత్తి విధానం ఉండదు. రాష్ట్రాలు భరిస్తున్న పది శాతం కూడా కేంద్రమే భరిస్తుంది.

పైవి కాకుండా, ఈశాన్య ప్రాంత రహదారి అభివృద్ధి పథకాన్ని కూడా ఎన్ఇసి అమలు చేస్తోంది. దీని కింద అంతర్ రాష్ట్ర రహదారులను అభివృద్ధి చేస్తారు. 100 శాతం కేంద్ర నిధులతో అమలయ్యే ఈ పథకాన్ని ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ కాకుండా, ఇక నుండి ఎన్ఇసి నే అమలు చేస్తుంది. ఈ పథకానికి కేంద్రం 1000 కోట్ల రూపాయలను కేటాయించింది.

మురిగిపోని కేంద్రీకృత వనరుల నిధి (కేంద్ర ప్రభుత్వం) పథకం కూడా ఉంది. అగర్తలా- అఖౌరా రైల్ లింక్ , మాజులీ ద్వీప క్షయాన్ని నివారించడం వంటి పథకాలు దీనికి కింద అమలవుతున్నాయి. ప్రస్తుతం దీనిని సంబంధిత కేంద్ర మంత్రిత్వ శాఖ అమలు చేస్తోంది. అయితే ఈ పథకాల అమలు బాధ్యతను కూడా ఎన్ఇసి కే బదిలీ చేస్తారు.

ఇంతకు పూర్వం కేంద్ర, రాష్ట్రాల వాటా కు సంబంధించి నిధుల బదిలీకి నిర్ధిష్టమైన విధానం లేదు. ఎన్ఒసి కి అందుబాటులో ఉండే నిధులను రెండుగా విభజిస్తారు. ఇందులో రాష్ట్ర వాటా 60 శాతం కాగా, 40 శాతం కేంద్ర వాటాగా ఉంటుంది. రాష్ట్ర వాటాను ఆయా రాష్ట్రాలలో అమలు చేసే పథకాలకు వినియోగిస్తారు. ప్రాంతీయ లక్షణాలు ఉన్న పథకాలకు సంబంధించి అంతర్ మంత్రిత్వ శాఖల ప్రమేయం అవసరం అవుతుంది. వెదురు, పందుల పెంపకం, ప్రాంతీయ పర్యటకం, ఉన్నత విద్య, సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి, ఉపాధి కల్పన, ఈశాన్య ప్రాంతంలో శాస్త్ర సాంకేతికత, ఈశాన్య ప్రాంత అభివృద్ధికి అవసరమైన సర్వేక్షణ, పరిశోధనలను ప్రాధాన్య రంగాలుగా గుర్తించారు.

కేంద్రం లోని ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ, ఈశాన్య ప్రాంత అభివృద్ధి మండలి తమ పనులను స్పష్టంగా అమలు చేసుకునేందుకు ఇది దోహదపడుతుంది. ఈశాన్య ప్రాంత అభివృద్ధి పై దృష్టి సారించడంలో భాగంగా ఉత్పత్తి మౌలిక సదుపాయాల అభివృద్ధి పథకం (పిఐడిడిసి) కి సంబంధించిన రుణ భార సమస్యను కూడా పరిష్కరించాలని నిర్ణయించారు.

కేంద్ర ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ, ఇతర మంత్రిత్వ శాఖ ల ప్రతినిధులతో కూడిన ఆర్థిక వ్యవహారాల స్థాయీ సంఘం పనితీరును నిర్వచించేందుకు ఎన్ఇసి కార్యదర్శి అధ్యక్షతన దీనిని ఏర్పాటు చేస్తారు. 5 నుండి 15 కోట్ల రూపాయల వరకు ఉన్న పథకాలను స్థాయీ సంఘం ఆమోదిస్తుంది. స్థాయీ సంఘం ఉండడం వల్ల ఒకే తరహా పథకాలను రెండు వేరువేరు సంస్థలు అమలు చేయడాన్ని నిరోధించడానికి వీలవుతుంది.

***