Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఉత్తరప్రదేశ్‌లోని మధురలో పడవ ప్రమాదం.. ప్రధానమంత్రి తీవ్ర దిగ్భ్రాంతి


ఉత్తరప్రదేశ్‌లోని మధురలో జరిగిన పడవ ప్రమాదంలో ప్రాణనష్టం సంభవించడం పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

ఈ దురదృష్టకర ప్రమాదంలో తమ ఆత్మీయులను కోల్పోయిన కుటుంబాలకు ప్రధానమంత్రి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ విషాద సమయంలో బాధితులకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను అందించడంలో స్థానిక యంత్రాంగం నిమగ్నమై ఉందని ప్రధానమంత్రి తెలిపారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌ వేదికగా ప్రధానమంత్రి ఈ విధంగా స్పందించారు.

‘‘ఉత్తరప్రదేశ్‌లోని మధురలో పడవ బోల్తా పడిన ఘటన తీవ్ర బాధను కలిగించింది. తమ ఆత్మీయులను కోల్పోయిన వారికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. స్థానిక యంత్రాంగం బాధితులకు అవసరమైనన సాయం అందిస్తోంది.’’

 

***