Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఉత్తరప్రదేశ్ మీర్జాపూర్‌లో రోడ్డు దుర్ఘటన.. ప్రాణనష్టం.. ప్రధానమంత్రి సంతాపం పీఎమ్ఎన్ఆర్ఎఫ్ నుంచి ఎక్స్‌గ్రేషియాను ప్రకటించిన ప్రధాని


ఉత్తరప్రదేశ్.. మీర్జాపూర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో కొందరు ప్రాణాలు కోల్పోవడంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ విచారాన్ని వ్యక్తం చేశారుఆత్మీయులను కోల్పోయిన కుటంబాలకు ప్రధాని సంతాపాన్ని తెలియజేస్తూఈ ప్రమాదంలో  గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు.
మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (పీఎమ్ఎన్ఆర్ఎఫ్నుంచి రూ.2 లక్షల వంతున,  గాయపడిన వారికి రూ.50,000 వంతున ఎక్స్‌గ్రేషియాను ప్రధాని ప్రకటించారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో  ఒక సందేశాన్ని ప్రధానమంత్రి శ్రీ మోదీ పొందుపరుస్తూ 
‘‘
ఉత్తరప్రదేశ్.. మీర్జాపూర్‌లో రోడ్డు దుర్ఘటన కారణంగా ప్రాణనష్టం జరిగిందని తెలిసినేను ఎంతో బాధపడ్డానుఆత్మీయులను కోల్పోయిన కుటుంబాలకు నా హృదయపూర్వక సంతాపాన్ని తెలియజేస్తున్నానుఈ ప్రమాదంలో గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను.

దుర్ఘటనలో మరణించిన వారి దగ్గరి సంబంధికులకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (పీఎమ్ఎన్ఆర్ఎఫ్నుంచి రూ.2 లక్షల వంతున ఎక్స్‌గ్రేషియాను ఇస్తారుగాయపడిన వారికి రూ.50,000 అందిస్తారు’’.

 

***