Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఎఐఐఎమ్ఎస్ లో కీల‌క ప‌థ‌కాల‌ను అంకితం చేయ‌నున్న ప్ర‌ధాన మంత్రి; మ‌రికొన్ని ప‌థ‌కాల‌కు శంకుస్థాప‌న కూడా..


ప్ర‌ధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ న్యూ ఢిల్లీ లోని అఖిల భార‌త వైద్య శాస్త్రాల సంస్థ (ఎఐఐఎమ్ఎస్) ను 2018, జూన్ 29వ తేదీ నాడు సంద‌ర్శించ‌నున్నారు.

ఆయ‌న ఎఐఐఎమ్ఎస్ లో నేష‌న‌ల్ సెంట‌ర్ ఫ‌ర్ ఏజింగ్ కు పునాదిరాయిని వేస్తారు. ఈ కేంద్రం వ‌యోవృద్ధుల‌కు మ‌ల్టి స్పెషాలిటీ హెల్త్‌కేర్ ను అందిస్తుంది. దీనిలో 200 ప‌డ‌క‌ల‌తో కూడిన‌ జ‌న‌ర‌ల్ వార్డు ఉంటుంది.

ఇదే కార్య‌క్ర‌మంలో ప్ర‌ధాన మంత్రి స‌ఫ్ దర్ జంగ్ ఆసుప‌త్రి లో 555 ప‌డ‌క‌ల‌తో కూడిన సూప‌ర్ స్పెషాలిటీ బ్లాకు ను ప్రారంభిస్తారు. అలాగే, స‌ఫ్ దర్ జంగ్ ఆసుప‌త్రి లో 500 ప‌డ‌క‌ల‌తో కూడిన న్యూ ఎమర్జెన్సీ బ్లాకు ను; ఎఐఐఎమ్ఎస్ లో 300 ప‌డ‌క ల‌తో కూడిన ప‌వ‌ర్ గ్రిడ్ విశ్రామ్ స‌ద‌న్ ను మ‌రియు , ఇంకా ఎఐఐఎమ్ఎస్, అన్సారీ న‌గ‌ర్ నుండి ట్రామా సెంట‌ర్ కు కనెక్షన్ మోటారబుల్ టనల్ ను దేశ ప్ర‌జ‌ల‌కు అంకితం చేస్తారు.