Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

కస్టమ్స్ అంశాలలో పరస్పర సహాయ సహకారాలకు భారతదేశం మరియు తాజికిస్తాన్ ల మధ్య ఒప్పందానికి ఆమోదం తెలిపిన మంత్రివర్గం


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం కస్టమ్స్ అంశాలలో పరస్పర సహాయ సహకారాల కోసం భారతదేశం మరియు తాజికిస్తాన్ ల మధ్య ఒక ఒప్పందం పై సంతకాలకు మరియు అనుమోదానికి ఆమోదం తెలిపింది.

కస్టమ్స్ సంబంధిత నేరాల దర్యాప్తునకు మరియు నివారణకు సంబంధించిన సమాచారం అందుబాటులోకి వచ్చేందుకు ఈ ఒప్పందం సహాయపడనుంది. అంతేకాకుండా ఈ ఒప్పందం రెండు దేశాల మధ్య వస్తువుల వర్తకం సాఫీగా సాగేందుకు మార్గాన్ని సుగమం చేస్తుందని కూడా ఆశిస్తున్నారు.

పూర్వరంగం:

రెండు దేశాల కస్టమ్స్ అధికారుల మధ్య సమాచారం మరియు రహస్య సమాచారం పంచుకోవడానికి ఒక చట్టబద్ధమైన ఫ్రేమ్ వర్క్ కు ఈ ఒప్పందం వీలు కల్పిస్తుంది. అలాగే, కస్టమ్స్ చట్టాల సముచిత వర్తింపునకు, కస్టమ్స్ నేరాల దర్యాప్తునకు, నివారణకు, ఇంకా చట్టబద్ధమైన వ్యాపారం చోటుచేసుకొనేందుకు కూడా ఉపయోగపడుతుంది. ఈ ఒప్పందం భారతీయ కస్టమ్స్ విభాగానికి ఉన్న ఆందోళనలను, మరీ ముఖ్యంగా వెల్లడించినటువంటి విలువ, వస్తువుల మూలం మరియు రెండు దేశాల మధ్య వ్యాపారం జరిగే వస్తువుల టారిఫ్ క్లాసిఫికేషన్ యొక్క వాస్తవికతకు సంబంధించిన సమాచారం ఇచ్చిపుచ్చుకోవడంలో ఆందోళనలను మరియు అవసరాలను పరిగణనలోకి తీసుకుంటుంది.

***