Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

కాత్యాయనీ మాతను ప్రార్థించి… సంస్కృత సుభాషితంతోపాటు ఓ భక్తి గీతాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి


కాత్యాయనీ మాతను ప్రార్థించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, జగదంబ ఆరాధన మనసును అనంత ఉత్తేజంతో, అంతర్గత శక్తితో నింపుతుందని అభివర్ణించారు. ఆ తల్లి దివ్య తేజస్సు మన హృదయాన్ని అత్యున్నత చైతన్యంతో ప్రకాశింపజేస్తుందని పేర్కొన్నారు. దైవత్వానికి, శౌర్యానికి ప్రతిరూపమైన ఆ దేవి ఆశీస్సులతో భక్తులందరికీ అపార శక్తి, ఆత్మవిశ్వాసం కలగాలని ఆయన ప్రార్థించారు.

ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’ ద్వారా పంపిన ఒక సందేశంలో:

కాత్యాయనీ మాతను స్తుతించే “చంద్రహాసోజ్జ్వలకరా శార్దూలవరవాహనా… కాత్యాయనీ శుభం దద్యాద్ దేవీ దానవఘాతిని” అనే శ్లోకాన్ని ప్రధానమంత్రి ప్రజలతో పంచుకున్నారు. అంతేకాకుండా…

జగదంబను ప్రస్తుతించే ఒక భక్తిగీతాన్ని కూడా ఇదే వేదికపై ఆయన పంచుకున్నారు.

“కాత్యాయనీ మాతకు వందనం! దివ్యత్వానికి, శక్తికి అధిపతి అయిన అమ్మవారి అనుగ్రహం భక్తులందరికీ అపార శక్తిని, ఆత్మవిశ్వాసాన్ని ప్రసాదించుగాక” అని ప్రధానమంత్రి ప్రార్థించారు. అలాగే,

“జగదంబ మాతను పూజించడం ద్వారా మనస్సు నిండా అనంత శక్తి, అపార ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతాయి. అమ్మవారి దివ్యశక్తి భక్తజన హృదయాలను దైవిక చైతన్యంతో ప్రకాశింపజేస్తుంది” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

— నరేంద్ర మోదీ 2026 మార్చి 24

****