Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

కామన్వెల్త్ క్రీడలు 2026లో మహిళల 48 కేజీల జూడో విభాగంలో స్వర్ణ పతకం సాధించిన అస్మితా డేకు ప్రధానమంత్రి అభినందనలు


గ్లాస్గోలో జరుగుతున్న కామన్వెల్త్ క్రీడలు 2026 మహిళల 48 కేజీల జూడో ఫైనల్లో స్వర్ణ పతకం కైవసం చేసుకున్న అస్మిత డేను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.

 

అస్మిత డే చూపిన అద్భుత ప్రదర్శన ఎప్పటికీ గుర్తుండిపోతుందని ప్రధాని పేర్కొన్నారు. ఆమె సాధించిన ఈ విజయం దేశంలో జూడో క్రీడకు మరింత ప్రజాదరణ పెరగడానికి తోడ్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

 

భవిష్యత్తులో ఆమె చేపట్టబోయే ప్రయత్నాలు దిగ్విజయం కావాలని ఆకాంక్షిస్తూ శ్రీ మోదీ శుభాకాంక్షలు తెలిపారు.

 

సామాజిక మాధ్యమం ఎక్స్‌ వేదికగా ప్రధానమంత్రి ఈ విధంగా పేర్కొన్నారు.

 

‘‘ఇది నిజంగానే స్వర్ణమయమైన ప్రదర్శన. జూడో మహిళల 48 కేజీల ఫైనల్లో పసిడి పతకం సాధించిన అస్మిత డేను చూసి గర్విస్తున్నాను. ఆమె ప్రదర్శన ఎప్పటికీ గుర్తుండిపోతుంది. దేశంలో జూడో క్రీడ మరింత ప్రాచుర్యం పొందడానికి ఇది దోహదపడుతుంది. రాబోయే రోజుల్లో ఆమె సాధించబోయే విజయాలకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. #CWG2026’’

 

****