Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

కృషి శక్తిని చాటిచెప్పే సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి


భారతీయ సంప్రదాయాల శాశ్వత జ్ఞ‌ానాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు తెలియజేశారు. దేశ నిర్మాణ ప్రక్రియలో నిరంతర యత్నానికీ, పట్టుదలకూ ఉన్న ప్రాధాన్యాన్ని ఆయన ఉద్ఘాటించారు.
ప్రయత్నమంటూ చేయకపోతే, అప్పటికే ప్రాప్తించిన దానిని కూడా కోల్పోయే ప్రమాదం పొంచి ఉంటుంది.. అంతేకాదు, రాబోయే కాలంలోనూ అవకాశాలు చేజారిపోతాయి. ఏమైనా, నిరంతర కృషి ద్వారానే కోరుకున్న ఫలితాలు సిద్ధించడంతో పాటు సమృద్ధిని కూడా సాధించవచ్చని ప్రధానమంత్రి స్పష్టం చేశారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో శ్రీ మోదీ ఈ కింది సంస్కృత శ్లోకాన్ని ఉదాహరించారు:
‘‘అనుత్థానే ధ్రువో నాశ: ప్రాప్తస్యానాగతస్య చ
ప్రాప్యతే ఫలముత్థానాల్లభతే చార్థసంపదమ్.’’