Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

పార్వతీ గిరి జీ శత జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నివాళులు


పార్వతీ గిరి జీ శత జయంతి ఈ రోజు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆమెకు నివాళులు అర్పించారు. వలసవాద పాలనను ముగించడానికి చేపట్టిన ఉద్యమంలో ఆమె పోషించిన పాత్రనూ, సమాజ సేవతో పాటు ఆరోగ్య సంరక్షణ, మహిళా సాధికారిత, సంస్కృతి వంటి రంగాల్లో ఆమె చేసిన కృషినీ శ్రీ మోదీ ప్రశంసించారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి వేర్వేరు సందేశాలను పొందుపరుస్తూ –
‘‘పార్వతీ గిరి గారికి ఆమె శత జయంతి సందర్భంగా నేను నివాళులు అర్పిస్తున్నాను. వలసవాద పాలనను ముగించడానికి చేపట్టిన ఉద్యమంలో ఆమె పోషించిన పాత్ర అభినందనీయం. సమాజ సేవ పట్ల ఆమె కనబరిచిన మక్కువ, ఆరోగ్య సంరక్షణ, మహిళా సాధికారిత, సంస్కృతి వంటి రంగాల్లో ఆమె చేసిన కృషీ ప్రశంసనీయం. కిందటి నెల #MannKiBaat (మన్ కీ బాత్ కార్యక్రమం)లో నేను చెప్పిన మాటలు ఇవిగో..’’
“ପାର୍ବତୀ ଗିରି ଜୀଙ୍କୁ ତାଙ୍କର ଜନ୍ମ ଶତବାର୍ଷିକୀ ଅବସରରେ ଶ୍ରଦ୍ଧାଞ୍ଜଳି ଅର୍ପଣ କରୁଛି। ଔପନିବେଶିକ ଶାସନର ଅନ୍ତ ଘଟାଇବା ଲାଗି ଆନ୍ଦୋଳନରେ ସେ ପ୍ରଶଂସନୀୟ ଭୂମିକା ଗ୍ରହଣ କରିଥିଲେ । ଜନ ସେବା ପ୍ରତି ତାଙ୍କର ଆଗ୍ରହ ଏବଂ ସ୍ୱାସ୍ଥ୍ୟସେବା, ମହିଳା ସଶକ୍ତିକରଣ ଓ ସଂସ୍କୃତି କ୍ଷେତ୍ରରେ ତାଙ୍କର କାର୍ଯ୍ୟ ଉଲ୍ଲେଖନୀୟ ଥିଲା। ଗତ ମାସର #MannKiBaat କାର୍ଯ୍ୟକ୍ରମରେ ମଧ୍ୟ ମୁଁ ଏହା କହିଥିଲି ।” అని పేర్కొన్నారు.

 

***