Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

కోల్ క‌తా లో నిర్మాణంలో ఉన్న ఫ్లై ఓవ‌ర్ కూలి పోయిన ఘ‌ట‌న అనంత‌రం చేప‌ట్టిన స‌హాయ‌క కార్య‌క్ర‌మాల పై ప్ర‌ధాన మంత్రి ప‌రిశీల‌న‌


కోల్ క‌తా లో నిర్మాణ ప‌నులు జ‌రుగుతున్న ఒక ఫ్లై ఓవ‌ర్ కూలి పోయిన ద‌రిమిలా అక్క‌డి స్థితి గ‌తుల‌ను, చేప‌ట్టిన స‌హాయ‌క కార్య‌క్ర‌మాల‌ను గురించి ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ వాక‌బు చేశారు. జ‌రిగిన సంఘ‌ట‌న ప‌ట్ల ఆయ‌న దిగ్భ్రాంతిని, విచారాన్ని వ్య‌క్తం చేశారు.

“కోల్ క‌తా లో నిర్మాణంలో ఉన్నఫ్లై ఓవ‌ర్ కూలి పోయింద‌ని తెలిసి నేను దిగ్భ్ర‌మకు గురయ్యాను. ఎంతో కలత చెందాను. అక్క‌డి స్థితి గ‌తుల‌ను, చేప‌ట్టిన స‌హాయ‌క కార్య‌క‌లాపాల‌ను గురించి అడిగి తెలుసుకున్నాను. ఈ ఘ‌ట‌న‌లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ స‌భ్యుల‌తో నా స‌హానుభూతిని పంచుకున్నాను. గాయాల పాలైన వారు సాధ్య‌మైనంత త్వ‌ర‌గా కోలుకోవాలి అని ఆశిస్తున్నాను” అని ప్ర‌ధాన మంత్రి పేర్కొన్నారు.

***