పిఎంఇండియా
ఖాయిలా పడ్డ/నష్టాలతో నడుస్తున్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను (సిపిఎస్ ఇ లు) నిర్ణీత కాలం లోపల మూసివేయడానికి మరియు స్థిరాస్తులను, చరాస్తులను విక్రయించడానికి సంబంధించి డిపార్ట్‌మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ (డిపిఇ) సవరణలు చేసిన మార్గదర్శక సూత్రాలకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈ రోజు జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదాన్ని తెలిపింది. సవరించిన మార్గదర్శక సూత్రాలు ఖాయిలా పడ్డ/నష్టాలలో ఉన్న సిపిఎస్ఇ ల మూసివేత ప్రణాళికలను అమలుపరచడంలో జరుగుతున్న జాప్యాలను తగ్గిస్తాయి. 2016 సెప్టెంబర్ నెలలో డిపిఇ జారీ చేసిన మార్గదర్శక సూత్రాల స్థానంలో తాజా మార్గదర్శక సూత్రాలు అమలవుతాయి.
సిపిఎస్ఇ ల మూసివేతకు ఉద్దేశించిన వివిధ ప్రక్రియలు, విధానాలు త్వరిత గతిన పూర్తి చేయడానికి ఒక స్థూలమైన ఫ్రేమ్ వర్క్ ఈ మార్గదర్శక సూత్రాలలో పొందుపరచబడింది. మూసివేత ప్రక్రియ తాలూకు ముఖ్య ఘట్టాలు వీటిలో పేర్కొనబడ్డాయి. సంబంధిత మంత్రిత్వ శాఖలు/విభాగాల బాధ్యతల రూపురేఖలు, నిర్ధిష్ట కాలావధి వంటివి ఇందులో భాగంగా ఉంటాయి. సిపిఎస్ ఇ లు మరియు పాలక మంత్రిత్వ శాఖ/విభాగాలు తీసుకోవలసిన ముందస్తు సన్నాహక చర్యలు ఏమిటన్నది, మూసివేత ప్రణాళికను సిద్ధం చేయడం, మూసివేత సందర్భంలో సిపిఎస్ఇ యొక్క శాసనసంబంధ మరియు ఇతర బాధ్యతలను నెరవేర్చే తతంగం, మూసివేతకు గురి అయ్యే సిపిఎస్ఇ ల స్థిరాస్తులను, చరాస్తులను కాలబద్ధ ప్రణాళికతో విక్రయించేందుకు సంబంధించి విధానాలు కూడా ఇందులో ఉంటాయి.
మూసివేత కు లోనయ్యే సిపిఎస్ఇ లకు చెందిన భూమి ని గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కు చెందిన తత్సంబంధిత మార్గదర్శక సూత్రాలకు అనుగుణంగా తక్కువ ఖర్చులో పూర్తి అయ్యే గృహ నిర్మాణం కోసం వినియోగించుకోవాలన్నది ఈ మార్గదర్శక సూత్రాల యొక్క ప్రథమ ప్రాధాన్యంగా ఉంటుంది. ఈ విధమైన సిపిఎస్ఇ లలో ఉద్యోగులు పని చేస్తున్న కారణంగా, మూసివేత వల్ల వారికి ఎటువంటి ఇక్కట్లు కలగజేయకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. వర్కర్లకు వారు పనిచేస్తున్న పే స్కేల్ తో నిమిత్తం లేకుండా 2007 నోషనల్ పే స్కేల్ ను బట్టి విఆర్ ఎస్ ఇచ్చే విధంగా ఒక ఏక రీతి విధానాన్ని ప్రస్తుతం నిర్దేశించడమైంది.
ఖాయిలా పడ్డ/ నష్టాలలో ఉన్న అన్ని సిపిఎస్ఇ లకు ఈ మార్గదర్శక సూత్రాలు వర్తిస్తాయి. ఎలాగంటే –
ఈ సిపిఎస్ఇ ల మూసివేత కోసం సిసిఇఎ/ మంత్రివర్గం నుండి ఆమోదాన్ని/ సూత్రప్రాయమైన ఆమోదాన్ని అడ్మినిస్ట్రేటివ్ మినిస్ట్రీ/డిపార్ట్‌మెంట్ లు పొందడం జరిగింది; లేదా సదరు సిపిఎస్ ఇ ని మూసివేయాలని అడ్మినిస్ట్రేటివ్ మినిస్ట్రీ/డిపార్ట్‌మెంట్ నిర్ణయించిన మీదట సంబంధిత ప్రాధికార సంస్థ నుండి ఆమోదాన్ని పొందే ప్రక్రియ కొనసాగుతోంది.
తక్కువ ఖర్చుతో కూడిన ఇళ్ల నిర్మాణానికి ప్రాధాన్యాన్ని ఇవ్వడం ద్వారా- ఖాయిలా పడ్డ/నష్టాలతో నడుస్తూ మూసివేత కు గురి కానున్న సిపిఎస్ ఇ ల భూభాగాలు- గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్నటువంటి, ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమం అయినటువంటి అఫార్డబుల్ హౌసింగ్ కై అందుబాటు లోకి రాగలవు.
***