Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

గణతంత్ర దినోత్సవ ప్రాధాన్యాన్ని చాటిచెప్పే సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి


భారతదేశ స్వాతంత్య్రానికి, రాజ్యాంగానికి, ప్రజాస్వామ్య విలువలకు గణతంత్ర దినోత్సవం శక్తిమంతమైన ప్రతీకని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. దేశ నిర్మాణం దిశగా ప్రజలు దృఢ సంకల్పంతో ముందుకు సాగడానికి స్ఫూర్తిని, మరింత అధిక శక్తిని గణతంత్ర దినోత్సవం అందిస్తోందని ఆయన అన్నారు.

ఈ సందర్భంగా ప్రధానమంత్రి ఒక సందేశంలో –
‘‘పారతంత్య్రాభిభూతస్య దేశస్యాభ్యుదయ: కుత:
అత: స్వాతంత్య్రమాప్తవ్యమైక్యం స్వాతంత్య్రసాధనమ్’’ అనే సంస్కృత సుభాషితాన్ని పంచుకున్నారు.
ఏ దేశమైనా ఆధారపడిందిగా ఉంటోనో, లేదా వంచనకు గురైతేనో ప్రగతిని సాధించజాలదు.. స్వాతంత్య్రాన్నీ, ఏకతనూ మార్గదర్శక సిద్ధాంతాలుగా స్వీకరించినప్పుడు మాత్రమే ఆ దేశ ప్రగతి సాధ్యపడుతుందని ఈ సుభాషితం తెలియజేస్తోంది.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఒక సందేశాన్ని పొందుపరుస్తూ –
‘‘గణతంత్ర దినోత్సవం మన స్వతంత్రం, రాజ్యాంగం, ప్రజాస్వామ్య విలువలకు శక్తిమంతమైన ప్రతీకగా నిలుస్తోంది. ఈ పర్వదినం మనకు ఏకతాటి మీద నిలిచి, దేశ నిర్మాణ సంకల్పంతో ముందుకు నడిచేందుకు కొత్త శక్తినీ, స్ఫూర్తినీ అందిస్తోంది.
‘‘పారతంత్య్రాభిభూతస్య దేశస్యాభ్యుదయ: కుత:
అత: స్వాతంత్య్రమాప్తవ్యమైక్యం స్వాతంత్య్రసాధనమ్’’ అని పేర్కొన్నారు.