Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

గుజరాత్‌లోని సనంద్‌లో కాయనెస్ సెమికాన్ కేంద్ర ప్రారంభోత్సవం

PM shares glimpses of his address at the inauguration of Kaynes Semicon Plant at Sanand, Gujarat


గుజరాత్‌లోని సనంద్‌లో కాయనెస్ టెక్నాలజీ సెమీకండక్టర్ కేంద్రం ప్రారంభోత్సవానికి సంబంధించిన పలు విశేషాలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారుఈ సందర్భంగా పరిశ్రమలో ఉత్పత్తి ప్రారంభమైనట్లుగా ప్రకటించారుఫిబ్రవరి 28న సనంద్‌లోని మైక్రాన్ కేంద్రంలో ఉత్పత్తి ప్రారంభోత్సవానికి తాను హాజరయ్యాననిసరిగ్గా నెల రోజుల తర్వాత కాయనెస్ కోసం మళ్లీ ఇక్కడికి వచ్చానని గుర్తుచేస్తూ..  దేశ సెమీకండక్టర్ ప్రయాణంలోని పురోగతిని ప్రధాని ప్రస్తావించారు‘‘ఇది కేవలం యాదృచ్చికం కాదుదేశ సెమీకండక్టర్ వ్యవస్థ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో చెప్పడానికి ఇది ఒక నిదర్శనం’’ అని శ్రీ మోదీ పేర్కొన్నారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి ఈ విధంగా పేర్కొన్నారు.

‘‘గుజరాత్‌లోని సనంద్‌లో కాయనెస్ సెమీకాన్ ఓఎస్‌ఏటీ కేంద్రాన్ని ప్రారంభించడం దేశ సెమీకండక్టర్ రంగానికి నిజంగా గర్వకారణంభవిష్యత్తు సాంకేతికతలుఆవిష్కరణల్లో అగ్రగామిగా ఎదగాలన్న భారత్‌ ప్రయత్నాలకు ఇది మరింత ఊపునిస్తుంది’’

‘‘మేక్ ఇన్ ఇండియా, ‘మేక్ ఫర్ ది వరల్డ్లకు ఇది మరిత బలాన్ని చేకూరుస్తుంది’’ 

‘‘దేశ సెమీకండక్టర్ పరిశ్రమ వివిధ రాష్ట్రాలలో అభివృద్ధి చెందుతూ.. లెక్కలేనంత మంది యువతకు కొత్త అవకాశాలను కల్పిస్తోందిఈ ప్రయత్నాలను మరింత విస్తరించేందుకు మేం ఇప్పుడు సెమీకండక్టర్ మిషన్ 2.0 పై పనిచేస్తున్నాం.’’

‘‘ఇది భారత టెకేడ్ (సాంకేతిక దశాబ్దం)!

సాంకేతికతఏఐసెమీకండక్టర్ రంగాల్లో మా కార్యక్రమాలు యావత్ ప్రపంచానికి ప్రయోజనం చేకూర్చబోతున్నాయి’’

 

***