Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

చట్ట సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్ తక్షణావసరమని స్పష్టం చేసిన ప్రధానమంత్రి


భారతీయ ప్రజాస్వామ్యాన్ని మరింత చైతన్యవంతంగానూప్రాతినిధ్యపూర్వకంగానూ తీర్చిదిద్దడానికి చట్ట సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్ తక్షణావసరమని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు స్పష్టం చేశారు.
ఈ రిజర్వేషనును అమల్లోకి తీసుకు రావడంలో ఆలస్యం జరిగితే అది అత్యంత దురదృష్టకరమైందవుతుందని ప్రధాని అన్నారుఈ అంశంపై శ్రీ మోదీ తన ఆలోచనలనూదృష్టికోణాన్నీ ఇటీవల అచ్చయిన ఒక ఓప్ఎడ్ వ్యాసంలో పంచుకున్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఒక సందేశాన్ని పొందుపరుస్తూ,
‘‘
చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ తక్షణావసరంఇది మన ప్రజాస్వామ్యాన్ని మరింత చైతన్యవంతంగాప్రాతినిధ్యపూర్వకంగా తీర్చిదిద్దుతుందిఈ రిజర్వేషనును అమల్లోకి తీసుకు రావడంలో ఆలస్యం జరిగితే అది అత్యంత దురదృష్టకరమైందవుతుందిఈ అంశంపై నా ఆలోచనల్ని ఈ వ్యాసంలో పంచుకున్నాను’’ అని పేర్కొన్నారు.

 

***