Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

చైనాలో గని ప్రమాదంలో ప్రాణనష్టం పట్ల ప్రధానమంత్రి ప్రగాఢ సంతాపం


చైనాలోని షాంగ్సీ ప్రావిన్స్‌లో  గని  ప్రమాదంలో సంభవించిన ప్రాణనష్టం పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ  తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

భారత ప్రజల తరఫున ప్రధానమంత్రి చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌కు,  చైనా ప్రజలకు సంతాపాన్ని తెలియజేస్తూ, ఈ విషాద సమయంలో మృతుల కుటుంబాలకు ధైర్యం కలగాలని శ్రీ మోదీ ప్రార్థించారు. జాడ తెలియని మిగిలిన వారందరూ త్వరగా, సురక్షితంగా బయటపడాలని ఆయన ఆకాంక్షించారు.

“చైనాలోని షాంగ్సీ ప్రావిన్స్‌లో జరిగిన గని ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోవడం నన్ను తీవ్రంగా కలచివేసింది. భారత ప్రజల తరఫున చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌కు, ఆ దేశ ప్రజలకు నా సంతాపాన్ని తెలియజేస్తున్నాను. ఈ విషాద సమయంలో బాధిత కుటుంబాలకు మానసిక ధైర్యం కలగాలని కోరుకుంటున్నాను. జాడ తెలియకుండా పోయిన మిగిలిన వారందరూ త్వరగా, సురక్షితంగా బయటపడాలని ప్రార్థిస్తున్నాను” అని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్‘ లో పేర్కొన్నారు.  

***