Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

‘జన్ ధన్ యోజన’ మూడవ వార్షికోత్సవం సందర్భంగా లబ్ధిదారులందరికీ అభినందనలు తెలిపిన ప్రధాన మంత్రి


‘జన్ ధన్ యోజన’ మూడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా చరిత్రాత్మకమైనటువంటి ఈ ఆర్థిక సమ్మిళిత కార్యక్రమం యొక్క లబ్ధిదారులందరికీ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలియజేశారు.

‘‘ఈ రోజున ‘జన్ ధన్ యోజన’కు మూడు సంవత్సరాలు పూర్తి అవుతున్నాయి. కోట్లాది ప్రజలకు, మరీ ముఖ్యంగా ఈ కార్యక్రమం ద్వారా ప్రయోజనం పొందిన పేదలకు ఇవే నా అభినందనలు.

పేదలను, అణగారిన వర్గాల వారిని ఆర్థిక ప్రధాన స్రవంతిలోకి తీసుకువచ్చేందుకు ఉద్దేశించిన ‘జన్ ధన్’ విప్లవం ఒక చరిత్రాత్మకమైన ఉద్యమం.

‘జన్ ధన్ యోజన’, ‘సామాజిక భద్రత పథకాలు’, ‘ముద్ర’, ఇంకా ‘స్టాండప్ ఇండియా’ ల ద్వారా మేము లక్ష‌లాది ప్రజల ఆకాంక్ష‌లకు రెక్కలు తొడిగాము.

గొప్ప ఉత్సాహంతో పేదలు మరియు అణగారిన వర్గాల వారి జీవితాలలో గుణాత్మకమైన, పరిణామ పూర్వకమైన మార్పును తీసుకు వచ్చేందుకు మేము చేస్తున్న ప్రయత్నాలు ఇక ముందు కూడా కొనసాగుతాయి’’ అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.