Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా జాతీయ అభివృద్ధికి, ప్రపంచ సుసంపన్నతకు శాస్త్ర, సాంకేతికతను వినియోగించుకుంటామని స్పష్టం చేసిన ప్రధానమంత్రి


జాతీయ సైన్స్ దినోత్సవం రోజున దేశాన్ని ముందుకు నడిపించే పరిశోధన, ఆవిష్కరణ, శాస్త్రీయ అంశాలను తెలుసుకోవాలనే స్ఫూర్తిని వేడుకగా జరుపుకుంటామని ప్రధానమంత్రి స్పష్టం చేశారు.

“సర్ సీవీ రామన్ సంచలనాత్మక ఆవిష‌్కరణ ‘రామన్ ఎఫెక్ట్‌‘ను ఈరోజు గుర్తుచేస్తుంది” అని పీఎం శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ఈ ఆవిష్కరణ భారతీయ పరిశోధనలను ప్రపంచ పటంలో నిలిపిందని ప్రధానమంత్రి తెలిపారు.

యువతకు సాధికారత కల్పించటం, పరిశోధనా వ్యవస్థలను బలోపేతం చేయటం, జాతీయాభివృద్ధి, ప్రపంచ సంక్షేమానికి శాస్త్ర, సాంకేతికతలను వినియోగించటం పట్ల మనకున్న సంకల్పాన్ని ప్రధానమంత్రి స్పష్టం చేశారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్‘లో ఇలా పేర్కొన్నారు:

నేడు జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా దేశాన్ని ముందుకు నడిపించే పరిశోధన, ఆవిష్కరణ, శాస్త్రీయ అంశాలను తెలుసుకోవాలనే స్ఫూర్తిని వేడుకగా జరుపుకుంటాం.

సర్ సీవీ రామన్ సంచలనాత్మక ఆవిష‌్కరణ రామన్ ఎఫెక్ట్‌ను ఈరోజు గుర్తుచేస్తుంది. ఈ ఆవిష్కరణ భారతీయ పరిశోధనలను ప్రపంచ పటంలో నిలిపింది.

యువతకు సాధికారత కల్పించటం, పరిశోధనా వ్యవస్థలను బలోపేతం చేయటం, జాతీయాభివృద్ధి, ప్రపంచ సంక్షేమానికి శాస్త్ర, సాంకేతికతలను వినియోగించటం పట్ల సంకల్పాన్ని మేం స్పష్టం చేస్తున్నాం. 

 

***