పిఎంఇండియా
కమ్యూనికేషన్ శాటిలైట్ అయిన జి ఎస్ ఎటి-11 కోసం లాంచ్ సర్వీసులను, గ్రౌండ్ సెగ్మెంట్ ను రూ.1,117 కోట్ల వ్యయంతో కొనుగోలు చేయాలన్న ప్రతిపాదనకు కేంద్ర మంత్రిమండలి ఆమోద ముద్ర వేసింది. కేంద్ర మంత్రివర్గ సమావేశానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత వహించారు.
2016 వ సంవత్సరం ఆఖరు కల్లా జి ఎస్ ఎటి-11 ప్రయోగానికి సిద్ధం అవుతుంది. 5,600 కిలోగ్రాముల ప్రయోగ బరువుండే ఈ ఉపగ్రహాన్ని దేశం వెలుపలి నుంచి కొనుగోలు చేసే ప్రయోగ వాహక నౌక ద్వారా అంతరిక్షంలోకి పంపించనున్నారు. గ్రామీణ కమ్యూనికేషన్ అవసరాలను నెరవేర్చడానికి భూమి పైన వసతులను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఇది వి ఎస్ ఎ టి ఎస్, బ్రాడ్ బ్యాండ్ తదితర సేవలను వినియోగించుకోవడానికి అవసరమైన కె యు- బ్యాండ్ సామర్థ్యాన్ని పెంచడం కోసం జి ఎస్ ఎటి-11 ను త్వరగా నింగిలోకి పంపించడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఆర్బిట్ టెస్టింగ్ సపోర్ట్ ను అందించడం తో పాటు బ్యాండ్ విడ్త్ లో కొంత భాగాన్ని సామాజిక సేవా కార్యక్రమాలకు కూడా ఉపయోగించుకోవడానికి జి ఎస్ ఎటి-11 తాలూకు గ్రౌండ్ సెగ్మెంట్ వెసులుబాటు కల్పిస్తుంది. అంతే కాకుండా, ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాలలో బ్రాడ్ బ్యాండ్ అనుసంధానం కోసం దాదాపు 10 జి బి పి ఎస్ సామర్థ్యం గల త్రూపుట్ సామర్థ్యాన్ని కూడా ఇది అందిస్తుంది.
పూర్వ రంగం :
అధిక బ్యాండ్ విడ్త్ కలిగిన వి ఎస్ ఎ టి కమ్యూనికేషన్ ను అందించగలిగేలా జి ఎస్ ఎటి-11 ను 32 హై- పవర్ స్పాట్ బీమ్ లతో డి ఒ ఎస్/ ఐఎస్ ఆర్ ఒ ఫెసిలిటీలలో ప్రస్తుతం తీర్చి దిద్దుతున్నారు.
***