Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

దివంగత నేత శ్రీ ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా ఆయనకు ప్రధానమంత్రి నివాళులు


దివంగత నేత శ్రీ నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా ఆయనకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఘన నివాళులు అర్పించారు.

 

ప్రజా సంక్షేమం, పరిపాలనపై ఆయనకున్న నిబద్ధత ద్వారా పేదలు, అణగారిన వర్గాల వారికి ఆత్మగౌరవంతో కూడిన జీవితాన్ని అందించారని, అందుకే ప్రజలు ఎన్టీఆర్‌ను ఎప్పుడూ ప్రేమగా గుర్తుంచుకుంటారని ప్రధానమంత్రి అన్నారు.

 

సినిమా రంగానికి ఎన్టీఆర్ గారు చేసిన అసాధారణ సేవలు ఇప్పటికీ తరతరాలను ఆకట్టుకుంటూనే ఉన్నాయని పేర్కొన్నారు. ఆయన జీవితం, ఆదర్శాలు ఎంతోమందికి ఒక గొప్ప స్పూర్తిగా నిలుస్తాయన్నారు.

 

సామాజిక మాధ్యమం ఎక్స్‌ వేదికగా ప్రధానమంత్రి ఈ విధంగా పేర్కొన్నారు.

 

‘‘మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్ గారి జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు.  ప్రజా సంక్షేమం, పరిపాలన పట్ల ఆయనకున్న అంకితభావం ద్వారా పేదలు, వెనుకబడిన వర్గాల వారికి ఆత్మగౌరవంతో కూడిన జీవితాన్ని అందించారు. అందుకే ప్రజలు ఆయన్ను ఎప్పటికీ అప్యాయంగా గుర్తుంచుకుంటారు. సినీ రంగానికి ఆయన అందించిన సేవలు నేటికీ తరతరాలను అలరిస్తున్నాయి. ఆయన జీవితం, ఆదర్శాలు మనకు ఎంతో స్ఫూర్తిదాయకం. ఆంధ్రప్రదేశ్‌లో నా మిత్రుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం.. ప్రజల కోసం ఎన్టీఆర్ గారు కన్న కలలను, ఆశయాలను ముందుకు తీసుకెళ్లడానికి పూర్తిగా కట్టుబడి ఉంది.’’

***