Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

న్యూఢిల్లీ లోని రామకృష్ణ మఠం సంక్షేమ కార్యక్రమాల విస్తరణకు స్థలం కేటాయింపు


న్యూఢిల్లీ లోని పహాడ్ గంజ్ కృష్ణా మార్కెట్ లో ఉన్న రామకృష్ణ మఠం సంక్షేమ కార్యకలాపాల విస్తరణకు గాను స్థలాన్ని కేటాయించే ప్రతిపాదనకు కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. కేంద్ర మంత్రివర్గ సమావేశానికి ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత వహించారు. దీంతో 17/80 ఎ మరియు 18/80 ఎ ప్లాట్ నంబర్లకు ఆగ్నేయంగా ఉన్న 82 చదరపు మీటర్ల స్థలాన్ని రామకృష్ణ మిషన్ కు కేటాయించేందుకు మార్గం సుగమమైంది.

నేపథ్యం :

న్యూఢిల్లీలోని కృష్ణా మార్కెట్ లో తమకు ఇప్పటికే కేటాయించిన స్థలాన్ని ఆనుకొని ఉన్న 82 చదరపు మీటర్ల చిన్న స్థలాన్ని తమ సంక్షేమ కార్యకలాపాల విస్తరణ కోసం తమకు కేటాయించవలసిందని ప్రభుత్వాన్ని రామకృష్ణ మిషన్ అభ్యర్థించింది. ఈ స్థలం ఖాళీగా ఉండి, చట్టవిరుద్ద కార్యకలాపాలు, ఆక్రమణ బారిన పడేటట్లుంది.