పిఎంఇండియా
పార్లమెంట్ హౌస్ వద్ద రెట్రోఫిట్ ఎలెక్ట్రిక్ బస్ ప్రదర్వన, ఆవిష్కరణ కార్యక్రమంలో భారత ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొన్నారు. డీజిల్ బస్ ను బ్యాటరీ తో నడిచే ఎలెక్ట్రిక్ బస్ గా రూపొందించిన ఈ వాహనాన్నికేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారులు శాఖ రూపొందించింది. వాతావరణ కాలుష్య నిరోధానికి ఈ బస్సు దోహదపడుతుంది. పార్లమెంటు సభ్యులకు కాలుష్య రహిత రవాణా అవసరాలను ఈ బస్ తీరుస్తుంది. అత్యంత ఆధునిక సదుపాయాలున్నఈ బస్సును ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తొలుత పరిశీలించి ప్రారంభించారు. బస్ తాళాన్ని లోక్ సభ స్పీకర్ శ్రీమతి సుమిత్రా మహాజన్ కు అందజేశారు. బస్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రధాన మంత్రి మాట్లాడారు. పర్యావరణ దుష్ప్రభావం పై ఎంతో కాలంగా చర్చలు చోటు చేసుకుంటున్నాయి. సగటు మనిషి పై ఆ దుష్ప్రభావాలను ప్రజలు గమనిస్తున్నారని ప్రధాని తెలిపారు.
ఈ మధ్య పారిస్ లో జరిగిన అంతర్జాతీయ కాప్-21 సదస్సులో ప్రస్తావించిన రెండు కీలకాంశాలను ప్రధాని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అమెరికా, ఫ్రాన్స్, ఇండియా సంయుక్తంగా మిషన్ ఇన్నొవేషన్ అనే నూతన కార్యక్రమాన్ని ప్రారంభించాయి. బిల్ మరియు మిలిండా గేట్స్ ఫౌండేషన్ సాయంతో గ్రీన్ టెక్నాలజీని అబివృధ్ధి పరచాలన్నదే ఈ ఇన్నొవేషన్ ఉద్దేశ్యం. ఇది మొదటిది కాగా, సూర్యకాంతి ఆధారంగా పనిచేసే అంతర్జాతీయ సోలార్ అలియన్స్ అనే నూతన సంస్థ ఏర్పాటు రెండవది. ఈ సంస్థ ఢిల్లీ ప్రధాన కేంద్ర బిందువుగా పనిచేస్తుందని ప్రధాని పేర్కొన్నారు.
ఎంపీలకు బస్సును ప్రారంభించడంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చేసిన కృషి అభినందనీయమని ప్రధాని ప్రస్తుతించారు. ప్రజా రవాణా కోసం అతి తక్కువ ఖర్చుతో ఎలక్ట్రిక్ బ్యాటరీలతో నడిచే వాహనాలను రూపొందించాలని ప్రధాని ఔత్సాహికులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో లోక్సభ స్పీకరు శ్రీమతి సుమిత్రా మహాజన్, కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, వెంకయ్యనాయుడు, ప్రకాశ్ జగదేవకర్ ,పలువురు పార్లమెంటు సభ్యులు పాల్గొన్నారు.
In Paris during #COP21, leaders of the world came together & focus was placed on innovation (in energy): PM @narendramodi @India4Climate
— PMO India (@PMOIndia) December 21, 2015
Another initiative, where India played a key role, is solar alliance. It consists of nations blessed with lot of sunlight: PM @India4Climate
— PMO India (@PMOIndia) December 21, 2015
This bus here (launched today), it is not making noise and scope of pollution also does not arise: PM @narendramodi https://t.co/ztQyG5hBNU
— PMO India (@PMOIndia) December 21, 2015
The Retrofit Electric Bus launched in Parliament today is a part of our larger efforts to create clean public transport & minimise pollution
— Narendra Modi (@narendramodi) December 21, 2015
Retrofitted Electric Bus is cost effective & is at the core of @makeinindia initiative- @isro is making Lithium–Ion batteries.
— Narendra Modi (@narendramodi) December 21, 2015
Highlighted why clean energy matters & key outcomes of #COP21 to mitigate #ClimateChange. @COP21 @India4Climate https://t.co/cOS5SqWNNR
— Narendra Modi (@narendramodi) December 21, 2015