Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

పిఎస్ఎల్ వి సి31 ని విజయవంతంగా ప్రయోగించినందుకు మరియు ఐఆర్ఎన్ఎస్ఎస్ 1ఇ ని ఖచ్చితమైన కక్ష్య‌లోకి ప్రవేశపెట్టినందుకు ఐఎస్ఆర్ఒ శాస్త్రవేత్త‌ల‌కు ప్రధాన మంత్రి అభినందనలు


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ భారత అంతరిక్ష ప‌రిశోధ‌న‌ సంస్థ (ఐఎస్ఆర్ఒ- ఇస్రో) శాస్త్రవేత్త‌ల‌తో మాట్లాడారు.

పిఎస్ఎల్ వి సి31 ని విజయవంతంగా ప్రయోగించినందుకు మరియు ఐఆర్ఎన్ఎస్ఎస్ 1ఇ ని ఖచ్చితమైన కక్ష్య‌లోకి ప్రవేశపెట్టినందుకు వారికి ఆయన తన అభినందనలు తెలిపారు.

“పిఎస్ఎల్ వి సి31 ని విజయవంతంగా ప్రయోగించినందుకు మరియు ఐఆర్ఎన్ఎస్ఎస్ 1ఇ ని ఖచ్చితమైన కక్ష్య‌లోకి ప్రవేశపెట్టినందుకు ఐఎస్ఆర్ఒ, అందులో పనిచేస్తున్న మన శాస్త్రవేత్త‌ల క్రియాశీలత్వాన్ని, దృఢ సంక‌ల్పాన్ని అభినందిస్తున్నాను.

ఐఎస్ఆర్ఒ లోని శాస్త్రవేత్త‌ల‌తో మాట్లాడి, వారు ఈ రోజు సాధించిన విజయాలకు అభినందనలు తెలియజేశాను. మన శాస్త్రవేత్త‌లు మనం గర్వపడే పనిని చేస్తున్నారు” అని ట్విటర్ లో ప్రధాన మంత్రి పేర్కొన్నారు.

***