Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

పు ఉంగ్‌జాగిన్‌ వాల్తే మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసిన ప్రధానమంత్రి


పు ఉంగ్‌జాగిన్‌ వాల్తే మృతి పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

మణిపూర్ ప్రజలకు పు ఉంగ్‌జాగిన్‌ వాల్తే చేసిన విశిష్ట సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని ప్రధానమంత్రి అన్నారు. సమాజంలో సానుకూల మార్పులు తీసుకురావటానికి ఆయన ఎంతో కృషి చేశారని, అసెంబ్లీలో ఆయన చేసిన ప్రసంగాలు ఆలోచనాత్మకంగా ఉండేవని కొనియాడారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:

“మణిపూర్ ప్రజలకు పు ఉంగ్‌జాగిన్‌ వాల్తే చేసిన విశిష్ట సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. సమాజంలో సానుకూల మార్పులు తీసుకురావటానికి ఆయన ఎంతో కృషి చేశారు. అసెంబ్లీలో ఆయన చేసిన ప్రసంగాలు విశ్లేషణాత్మకంగా ఉండేవి. ఆయన మరణం బాధాకరం. ఆయన కుటుంబసభ్యులకు, మిత్రులకు, మద్దతుదారులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా”