Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రధానితో స్లోవాక్ దేశాధ్యక్షుడు పీటర్ పెల్లెగ్రిని భేటీ

ప్రధానితో స్లోవాక్ దేశాధ్యక్షుడు పీటర్ పెల్లెగ్రిని భేటీ


ఢిల్లీలో భారత ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ‌తో స్లోవాక్ రిపబ్లిక్ అధ్యక్షుడు శ్రీ పీటర్ పెల్లెగ్రిని సమావేశమయ్యారు. ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేయడంపై దృష్టి సారించిన ఈ భేటీ అత్యంత ఫలప్రదంగా సాగింది.

ఇటీవల కుదిరిన భారత్-ఈయూ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం రెండు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులను పెంపొందించడానికి అనేక అవకాశాలను సృష్టిస్తుందని ప్రధాన మంత్రి పేర్కొన్నారు.

డిజిటల్ సాంకేతిక, అంకురాలు, డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలు, రక్షణ, అంతరిక్ష రంగం, పరస్పర ఆసక్తి ఉన్న ఇతర అంశాలలో సహకారంపై కూడా ఇరు నేతలు చర్చించారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధాని ఈ విధంగా పేర్కొన్నారు:

“స్లోవాక్ దేశాధ్యక్షుడు శ్రీ పీటర్ పెల్లెగ్రిని‌తో సమావేశం అత్యంత ఫలప్రదంగా సాగింది. ఇటీవలి భారత్-ఈయూ ఎఫ్‌టీఏ మన రెండు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులను పెంపొందించడానికి అనేక అవకాశాలను కల్పిస్తుంది. డిజిటల్ సాంకేతికత, అంకురాలు, డిజిటల్ ప్రజా మౌలికసదుపాయాలు, రక్షణ, అంతరిక్ష రంగం, ఇతర అంశాలలో సహకారంపై కూడా మేం చర్చించాం”.

@PellegriniP_”