Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రధానమంత్రి అధ్యక్షతన 51వ ప్రగతి సమావేశం

ప్రధానమంత్రి అధ్యక్షతన 51వ ప్రగతి సమావేశం


కేంద్రరాష్ట్ర ప్రభుత్వాల కృషిని సమర్థంగా సమన్వయం చేయడం ద్వారా క్రియాశీల పాలననుసకాలంలో పథకాల అమలును నిర్ధారించడం లక్ష్యంగా పనిచేసే ఐసీటీ ఆధారిత బహుళమాధ్యమ వేదిక ప్రగతి‘ (పీఆర్ఏజీఏటీఐ51వ సమావేశం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈ రోజు ఉదయం సేవా తీర్థ్లో జరిగింది.

తొమ్మిది రాష్ట్రాల్లో… రైల్వేవిద్యుత్రహదారి రంగాల్లో చేపట్టిన సుమారు రూ.30,000 కోట్ల విలువైన ఏడు కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల పురోగతిని ఈ సమావేశంలో ప్రధానమంత్రి సమీక్షించారుఆర్థిక వృద్ధికిప్రజా సంక్షేమానికి కీలకమైన ఈ ప్రాజెక్టుల కాలపరిమితులుఏజెన్సీల మధ్య సమన్వయంసమస్యల సకాల పరిష్కారంపైనా సమీక్ష నిర్వహించారుకెన్ బెట్వా లింక్ ప్రాజెక్ట్స్వచ్ఛ భారత్ మిషన్అర్బన్ 2.0 ప్రాజెక్టుల పురోగతినీ ప్రధానమంత్రి సమీక్షించారు.

విద్యుత్ రంగ ప్రాజెక్టుల సమీక్షలో భాగంగా పట్టణ ప్రాంతాల్లోముఖ్యంగా నగరాలునివాస సముదాయాలుప్రభుత్వ సంస్థలను ప్రత్యేకంగా ప్రస్తావించిన ప్రధానమంత్రి… రూఫ్‌టాప్ సోలార్ వినియోగాన్ని వేగవంతం చేయాల్సిన అవసరాన్ని ప్రధానంగా ప్రస్తావించారుగృహసామాజిక స్థాయిలో విద్యుత్ ఖర్చులను తగ్గించడానికిఇంధన భద్రతను మెరుగుపరచడానికిపరిశుద్ధ ఇంధనాన్ని ప్రోత్సహించడానికి రూఫ్‌టాప్ సోలార్‌ను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని ఆయన ఉద్ఘాటించారు.

రహదారులునౌకాశ్రయాల కనెక్టివిటీ ప్రాజెక్టుల సమీక్షలో భాగంగాభవిష్యత్తుకు సిద్ధంగా ఉండే లాజిస్టిక్స్ వ్యవస్థను సృష్టించడానికి ప్రతి ప్రధాన రవాణా విధానాన్ని సజావుగా అనుసంధానించేలా… వధావన్ పోర్ట్‌ను పోర్ట్ఆధారితమల్టీమోడల్ అభివృద్ధికి ఒక నమూనాగా అభివృద్ధి చేయాలని స్పష్టం చేశారుఈ ప్రాజెక్టును కేవలం ఒక పోర్ట్‌గా మాత్రమే కాకుండా… తీరప్రాంత నౌకాయానంఅంతర్గత జలమార్గాలుప్రత్యేక సరుకు రవాణా కారిడార్లుహైస్పీడ్ రైలు కనెక్టివిటీహైవేలువిమానాశ్రయాలను అనుసంధానించే దేశపు ముఖద్వారంగా చూడాలన్నారు.

స్వచ్ఛ భారత్ మిషన్ 2.0ను సమర్థంగా అమలు చేయాల్సిన అవసరాన్ని ప్రధానమంత్రి ప్రధానంగా ప్రస్తావించారుఈ మిషన్ కేవలం మౌలిక సదుపాయాల కల్పనకే పరిమితం కాకుండా… నిరంతర పర్యవేక్షణపౌరుల భాగస్వామ్యంవివిధ భాగస్వాముల మధ్య సమన్వయం ద్వారా విశ్వసనీయ ఫలితాలను సాధించాలని ఆయన ఉద్ఘాటించారువ్యర్థాల శుద్ధి ప్లాంట్లుగోబర్ధన్ ప్లాంట్లు సహా ఘన వ్యర్థాల నిర్వహణకు సంబంధించిన మౌలిక సదుపాయాల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని ఆయన రాష్ట్రాలను కోరారు.

కెన్బెట్వా నదుల అనుసంధాన ప్రాజెక్టు సమీక్షలో భాగంగా… రాష్ట్రాల మధ్య జల వివాదాలను సహకారంసకాలంలో లభించే అనుమతులుసాంకేతికత ఆధారిత పర్యవేక్షణమిషన్మోడ్ అమలు ద్వారా పరిష్కరించుకోవడంలో ఈ ప్రాజెక్టు ఇతర రాష్ట్రాలకు ఒక నమూనాగా నిలవాలని ప్రధానమంత్రి అభిప్రాయపడ్డారుదీర్ఘకాలిక జల భద్రతను కల్పించే దిశగా… నదుల అనుసంధానంజల సంరక్షణభూగర్భ జలాల పెంపుసమర్థ సాగునీటి వినియోగం వంటి అంశాలను సమగ్ర రీతిలో చేపట్టడానికి వీలుండే ఇతర అవకాశాలనూ గుర్తించాలని రాష్ట్రాలకు సూచించారు.

ప్రజా ప్రాజెక్టుల అమలులో జాప్యం వల్ల వ్యయాలు పెరగడమే కాకుండా… అవసరమైన సౌకర్యాలుఅభివృద్ధి ప్రయోజనాలను పౌరులు సకాలంలో పొందలేకపోతున్నారని ప్రధానమంత్రి స్పష్టం చేశారుప్రతీ జాప్యం ప్రజల జీవితాలుప్రాంతీయ అభివృద్ధిప్రజా వనరులపైనా ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుందని ఆయన వ్యాఖ్యానించారుపెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించడానికిఅడ్డంకులను తొలగించడానికివేగవంతమైన అమలును నిర్ధారించడానికి మంత్రిత్వ శాఖలువిభాగాలురాష్ట్రాలు మరింత చురుకైనకాలపరిమితితో కూడిన విధానాన్ని అవలంబించాలని ఆయన ఉద్ఘాటించారు.

స్వచ్ఛమైన విద్యుత్ ఉత్పత్తి కోసం కాలువల వెంబడికాలువలపై సౌర ఫలకాలను ఏర్పాటు చేయడం సహా… కాలువల వ్యవస్థలను వినూత్నంగా ఉపయోగించుకునే మార్గాలను అన్వేషించాలని ప్రధానమంత్రి సూచించారుభూ వినియోగాన్ని గరిష్ఠ స్థాయికి చేర్చడానికిబాష్పీభవన నష్టాలను తగ్గించడానికిపునరుత్పాదక ఇంధనాన్ని ఉత్పత్తి చేయడానికిజల మౌలిక సదుపాయాల నుంచి అదనపు ఆర్థిక విలువను సృష్టించడానికీ ఇది సహాయపడుతుంది.

సమావేశం ప్రారంభంలో క్యాబినెట్ కార్యదర్శి మాట్లాడుతూ ప్రధానమంత్రి ఆదేశాలకు అనుగుణంగానే రాష్ట్ర స్థాయిలో సామాజిక రంగ పథకాల నెలవారీ సమీక్షా విధానం అమలులోకి వచ్చిందని తెలిపారురాష్ట్రాలుజిల్లా స్థాయిల్లో నిరంతర పర్యవేక్షణనుఅమలు సంబంధింత సమస్యల వేగవంతమైన పరిష్కారాన్నిమరింత జవాబుదారీతనాన్ని నిర్ధారించడమే ఈ విధాన లక్ష్యంఈ కార్యక్రమంలో భాగంగా… ప్రాథమిక దశలో రాష్ట్ర స్థాయి సమీక్ష కోసం స్వచ్ఛ భారత్ మిషన్ను ఎంపిక చేశారు

 

***